కన్నప్పలో కిరాతగా.. మోహన్‌‌లాల్

కన్నప్పలో కిరాతగా.. మోహన్‌‌లాల్

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ఇందులో ప్రభాస్, కాజల్, అక్షయ్ కుమార్, మోహన్‌‌లాల్, శివ రాజ్ కుమార్, శరత్ కుమార్  లాంటి స్టార్స్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఒక్కొక్కరి పాత్రలను పరిచయం చేస్తున్న టీమ్.. సోమవారం మోహన్ లాల్ లుక్‌‌తో పాటు ఆయన క్యారెక్టర్‌‌‌‌ను రివీల్ చేసింది. 

ఇందులో ఆయన కిరాత అనే ప‌‌వ‌‌ర్‌‌ఫుల్ రోల్‌‌లో క‌‌నిపించ‌‌బోతున్నట్లు తెలియజేస్తూ..  రిలీజ్ చేసిన పోస్టర్‌‌‌‌లో గంభీరమైన లుక్‌‌లో కనిపిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉందీ మోహన్ లాల్ గెటప్.  ‘మహాభారతం’ టీవీ సిరీస్‍ను తెరకెక్కించిన ముకేశ్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా మోహన్ బాబు నిర్మిస్తున్నారు.  బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, దేవరాజ్, ఐశ్వర్య, ముకేశ్ రుషి ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 25న వరల్డ్‌‌వైడ్‌‌గా సినిమా విడుదల కానుంది.