మోహన్ లాల్ (Mohanlal) హీరోగా వచ్చిన ‘లూసిఫర్’(Lucifer) సినిమా మళయాళంలో బ్లాక్ బస్టర్ అవడంతో పాటు ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకులనూ ఆకట్టుకుంది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో మళయాళ యంగ్ హీరో టోవినో థామస్, వివేక్ ఒబెరాయ్, మంజు వారియర్, కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ఇందులో యాక్టర్ కం డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ స్పెషల్ క్యామియోలో కనిపించాడు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ కావడంతో గతేడాది లూసిఫర్ కు సీక్వెల్ ప్రకటించాడు పృథ్వీరాజ్ సుకుమారన్.
తాజా విషయానికి వస్తే దర్శకుడు పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు మళయాళంలో ‘ఎల్2: ఎంపురాన్’(L2 Empuraan) అనే టైటిల్‌తో రూపొందిస్తున్న విషయం తెలిసిందే. నేడు మే 21న మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ బర్త్ డే స్పెషల్ గా ఎల్2 నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ పోస్టర్ లో మోహన్ లాల్ చుట్టు బాడీ గార్డ్స్ ఉండగా..చాలా గంభీరంగా వారి మధ్యలో సింహంలా నడుచుకుంటూ వస్తున్నాడు. అయితే, మేకర్స్ మాత్రం లూసిఫర్ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయం ప్రస్తుతానికైతే వెల్లడించలేదు. ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
మొదటి భాగంలో నటించిన మంజు వారియర్, టోవినో థామస్, ఇంద్రజిత్ సుకుమారన్ వంటి నటీనటులు ఈ సీక్వెల్‌లో కూడా కనిపించనున్నారు. త్వరలో ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది.
ఎల్2 స్టోరీ విషయానికి వస్తే..
లూసిఫర్ మూవీలో మోహన్‌లాల్ స్టీఫెన్ గట్టుపల్లి అనే ఓ పొలిటికల్ లీడర్ గా కనిపిస్తాడు. అయితే రాజకీయ నాయకుడు కాకముందు ఈ ప్రపంచాన్నే శాసించే ఓ మాఫియా లీడర్ అబ్రహాం ఖురేషిగా మారడం క్లైమాక్స్ లో చూపించారు. లూసిఫర్ సెకండ్ పార్ట్ లో అసలు ఒక సాధారణ వ్యక్తి అయిన స్టీఫెన్..మాఫియా లీడర్ అబ్రహాం ఖురేషి ఎలా అయ్యాడు? అతడు చేసిన పనులు ఏంటి? ఎందుకు రాజకీయ నాయకుడిగా మారాడు అని చూపించనున్నట్లు తెలుస్తుంది
అలాగే తన తమ్ముడైన టోవినో థామస్ ను ముఖ్యమంత్రిని చేసి విదేశాలకు వెళ్లిన లూసిఫర్ ఎవరు ? తండ్రి లాంటి వ్యక్తి నుంచి దూరమైన వ్యక్తి లూసిఫర్ గా ఎలా ఎదిగాడు ? అనేది ‘ఎల్2:ఎంపురాన్ సీక్వెల్ లో చూపించనున్నారు.
లూసిఫర్ విషయానికి వస్తే..
పృథ్విరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన లూసిఫర్ సినిమా మళయాళంలో సూపర్ హిట్ కొట్టిన తర్వాత..తెలుగులో కూడా అదే టైటిల్ తో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు మేకర్స్. ఇక్కడా కూడా భారీ హిట్ కొట్టింది. ఇక ఆ తర్వాత వెంటనే మెగాస్టార్ చిరంజీవి ఇదే సినిమాను గాడ్ ఫాదర్ టైటిల్ తో రీమేక్ చేసి రిలీజ్ చేసి హిట్ కొట్టాడు. అయితే గాడ్ ఫాదర్ సినిమాను మాత్రం డైరెక్టర్ మోహన్ రాజా తెరక్కించారు. అపుడు ఈ మూవీ తెలుగులో 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం.
Happy birthday Laletta! #KhureshiAbraam #L2E#HappyBirthdayMohanlal
— Prithviraj Sukumaran (@PrithviOfficial) May 21, 2024
Malayalam | Tamil | Telugu | Kannada | Hindi@mohanlal #MuraliGopy @LycaProductions #Subaskaran #gkmtamilkumaran @antonypbvr @aashirvadcine @prithvirajprod #SureshBalaje #GeorgePius @ManjuWarrier4 @ttovino… pic.twitter.com/iTUeDJJVBM