Neru Movie OTT: ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడు..ఎక్కడంటే?

Neru Movie OTT: ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడు..ఎక్కడంటే?

నలభయ్యేళ్లుగా రకరకాల పాత్రలతో ప్రేక్షకుల్ని ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్ చేస్తున్నా..ఇప్పటికీ కొత్తదనం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు మోహన్‌‌‌‌లాల్ (Mohanlal). ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రయోగానికి తెర తీస్తూనే ఉంటారాయన. 

రీసెంట్గా మోహన్‌‌‌‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ నేరు (Neru). డిసెంబర్ 21న థియేటర్లో రిలీజై  మంచి సక్సెస్ అందుకుంది. ఈ మూవీని ప్రముఖ దర్శకుడు జీతూ జోసెఫ్‌ (JeethuJoseph) తెరకెక్కించారు. షారుఖ్ డంకీ, ప్రభాస్ సలార్ మూవీస్కి  పోటీగా వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ని ఆకట్టుకుంటోంది. నేరు మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల మార్క్‌ను టచ్ చేసింది.

ఈ ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ నేరు మూవీని దృశ్యం సిరీస్ని డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్..కొత్త జోనర్ని టచ్ చేస్తూ తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. దీంతో ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్దమైంది.ఈ నెల (జనవరి 23) నుంచి తెలుగు, మలయాళం, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీలో మోహన్‌లాల్‌తో పాటు లీడ్ రోల్‌లో అనస్వరా రాజన్, ప్రియమణి కీలక పాత్రలో నటించారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 

నేరు మూవీ కథ విషయానికి వస్తే.. 

ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలపై జరుగుతోన్న అఘాయిత్యాలను చూపిస్తున్న చిత్రం నేరు. ఇందులో ఒక చూపు లేని అమ్మాయి మానభంగానికి గురైతే దోషులను పట్టించే క్రమంలో..లాయర్ అయిన హీరో మోహన్ లాల్ ఈ కేసు కోసం ఎలా సహాయపడ్డాడు..అందుకు ఎదురయ్యిన అడ్డంకులు ఏంటీ అనే పాయింట్ తోనే ఈ సినిమా ఉంటుంది. కథ వింటే సింపుల్గా..ఇప్పటికీ చాలా సినిమాల్లో తెలిసిన కథ అని అనిపించినా..దీని డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ ఇంటెన్స్ కోర్ట్ సీన్ యాక్షన్ డ్రామాతో తెరకెక్కించి సక్సెస్ అయ్యారు.