
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఇటీవలే శబరిమలలో 'ఉషా పూజ' సందర్భంగా తన స్నేహితుడు, మరో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి పేరు మీద పూజలు చేయించిన అంశం కేరళ రాష్ట్రలో హాట్ టాపిక్ గా మారింది. అయితే మార్చి 18న శబరిమల ఆలయంలో మోహన్ లాల్ పూజారికి మమ్ముట్టి పూర్తి పేరు ముహమ్మద్ కుట్టి మరియు అతని జన్మ నక్షత్రం 'విశాఖం' అని చెబుతూ పూజలు చేయించాడు.
ఈ అంశాన్ని కొందరు మత సామరస్యంగా తీసుకుంటుంటే మరికొందరు మాత్రం హిందువైన మోహన్ లాల్ ముస్లిమ్ అయిన మమ్ముట్టి పేరు మీద అయ్యప్ప స్వామి గుడిలో ఎలా పూజలు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు సీనియర్ జర్నలిస్ట్, ఇన్ఫ్లుయేన్సర్ ఒ.అబ్దుల్లా కూడా స్పందిస్తూ మోహన్ లాల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. అలాగే ముస్లిం మతస్థులు కేవలం అల్లా ని తప్ప ఇతర దేవుళ్ళని పూజించరని కాబట్టి మోహన్ లాల్ క్షమాపణ చెప్పాల్సిందేనని అన్నాడు.
ALSO READ | PradeepRanganathan:ప్రదీప్ రంగనాథన్-మైత్రి మేకర్స్ మూవీ అనౌన్స్.. ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
ఈ విషయంపై మోహన్ లాల్ స్పందిస్తూ మమ్ముట్టి తనకి మంచి స్నేహితుడు మాత్రమేకాదు సోదరుడు కూడా అని అతడి ఆరోగ్యం కుదుట పడాలని పూజలు చేయించడంలో తప్పేముందని కౌంటర్ ఇచ్చాడు. అంతటితో ఆగకుండా దేవస్వం కార్యాలయంలో మమ్ముట్టి పేరు మీద పూజ చేయించి ప్రసాద నైవేద్యాలు తీసుకున్న రసీదుని ఆలయంలో పని చేసేవాళ్ళే లీక్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
దీంతో ఈ రసీదు లీక్ విషయంపై ఆలయ అధికారులు స్పందిస్తూ దేవస్వం బోర్డు సభ్యుడు రసీదును లీక్ చేశాడని మోహన్ లాల్ ఆరోపించిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని కొట్టి పారేశారు. అలాగే ఒరిజినల్ రసీదు దేవస్వం బోర్డు భక్తులకు మాత్రమే రసీదు అందుతుందని కాబట్టి మోహన్ లాల్ ఈ విషయంలో ఎక్కడో పొరబడి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తానికి అయ్యప్ప పూజ కాంట్రావర్సీ కేరళలో సినీ ఫ్యాన్స్ మధ్య మత వివాదం లేవనెత్తిందని మరికొందరు నెటిజన్లు అంటున్నారు.
ALSO READ | RC16 Tittle and First Look Update: చేతిలో బీడీ.. కర్లీ హెయిర్.. బుచ్చిబాబు గట్టిగానే ప్లాన్ చేశాడా..?
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మోహన్ లాల్ మలయాళంలో ప్రముఖ డైరెక్టర్, హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన ఎల్2: ఎంపురాన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా మార్చ్ 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతోంది. అయితే గతంలో మోహన్ లాల్ నటించిన "లూసీఫర్" బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాని తెలుగులో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి "గాడ్ ఫాథర్" పేరుతో రీమేక్ చేశాడు.. కానీ ప్లాప్ అయ్యింది.