వైవిధ్యభరిత సినిమాలు, కొత్త తరహా కంటెంట్‌తో ప్రేక్షకులను ఎంగేజ్ చేసే మలయాళ స్టార్ మోహన్ లాల్ ‘బరోజ్ 3డీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇందులో టైటిల్ రోల్ పోషించడంతో పాటు ఆయనే డైరెక్ట్ చేశారు. ఆంటోని పెరుంబవూర్ నిర్మించారు. డిసెంబర్ 25న సినిమా విడుదల సందర్భంగా మోహన్ లాల్ మాట్లాడుతూ ‘ఇదొక ఫ్యాంటసీ సినిమా. గార్డియన్ ఆఫ్ డి గామాస్ అనే ట్రెజర్ నవల ఆధారంగా ఓ ఇమాజనరీ అండ్వంచర్ స్టోరీగా దీన్ని రూపొందించాం. వాస్కో డిగామాలో ఉన్న రహస్య నిధిని కాపాడే బరోజ్ పాత్రను పోషించా. ఆ సంపదను నిజమైన వారసుడికి అందించడానికి అతను చేసే ప్రయత్నాలే ఈ సినిమా కాన్సెప్ట్. ఇప్పటివరకూ మలయాళంలో మూడు త్రీడీ సినిమాలే వచ్చాయి.
ఇప్పుడు టెక్నాలజీని వాడుకుని చాలా యూనిక్‌గా త్రీడీలో దీన్ని తెరకెక్కించాం. స్టోరీ టెల్లింగ్‌ని రీ డిస్కవర్ చేయడంతో పాటు విజువల్ వండర్‌గా ఆకట్టుకుంటుంది. దర్శకుడిగా నాకిది కొత్త అనుభూతిని పంచింది. డైరెక్టర్‌గా ఫస్ట్ సినిమానే త్రీడీలో తీయడం చాలెంజింగ్‌గా అనిపించింది. హాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ మార్క్ కిల్లియన్ దీనికి బీజీఎం ఇచ్చారు. 12 ఏళ్ల లిడియన్ నాదస్వరం సాంగ్స్ కంపోజ్ చేయడం విశేషం. ప్రేక్షకులు ఓ కొత్త ప్రపంచాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారనే నమ్మకం ఉంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ తెలుగులో రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది’.