Thriller Drama: 5 రోజుల్లోనే వంద కోట్ల క్లబ్లో చేరిన మలయాళ థ్రిల్లర్ డ్రామా.. తెలుగు థియేటర్లలోనూ..

Thriller Drama: 5 రోజుల్లోనే వంద కోట్ల క్లబ్లో చేరిన మలయాళ థ్రిల్లర్ డ్రామా.. తెలుగు థియేటర్లలోనూ..

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. ఇటీవలే L2 ఎంపురన్ తో భారీ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు చేసింది. దాంతో మలయాళ ఇండస్ట్రీలో హయ్యెస్ట్ గ్రాస్ వసూళ్లు సాధించిన మూవీగా చరిత్ర సృష్టించింది.

ఈ క్రమంలో మోహన్ లాల్ మరో కొత్త సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘తుడరుమ్’ (Thudarum). వెటరన్ హీరోయిన్ శోభన..ఆయనకు జోడీగా నటించారు. తరుణ్ మూర్తి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని రెజపుత్ర విజువల్ మీడియా బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఎం.రెంజిత్ నిర్మించారు. ఏప్రిల్ 25న ఈ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా విడుదలైంది. తెలుగులోనూ ఈ మూవీ రిలీజైంది. 

తుడరుమ్ సినిమాకు ఫస్ట్ షో నుంచే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు సినిమా బాగా నచ్చింది. ఈ సినిమాలో మోహన్‌లాల్ నటన సూపర్ అంటూ అభిమానులు, రివ్యూయర్లు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఈ మూవీ దృశ్యం మూవీ శైలిలో ఉందంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

తుడరుమ్ కథలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్కు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తోడవడంతో భారీ విజయం సొంతం చేసుకుంది. దాంతో ఈ మూవీ రిలీజైన 5 రోజుల్లోనే వంద కోట్ల క్లబ్లో చేరింది. ఈ మేరకు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. 

►ALSO READ | HIT3 Box Office: హిట్ 3 ఫస్ట్ డే ట్రేడ్ వర్గాల భారీ అంచనా.. నానికి బిగ్గెస్ట్ ఓపెనింగ్ కానుందా?

సాక్నిల్క్ ప్రకారం, తుడరుమ్ ఇండియాన్ బాక్సాఫీస్ వద్ద రూ.37.58 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. పన్నులతో సహా, ఇది 44.38 కోట్ల వసూళ్లకు సమానం. ఇండియన్ మరియు ఓవర్సీస్ వసూళ్లను కలిపి ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టింది .తెలుగు రాష్ట్రాలలో కూడా బ్రేక్ ఈవెన్ సాధించి, లాభాలతో రన్ అవుతుంది. ఈ సినిమాను తెలుగులో దీపా ఆర్ట్స్ బ్యానర్ పై పి శ్రీనివాస్ గౌడ్ గ్రాండ్గా రిలీజ్ చేశారు. 

అయితే, మోహన్ లాల్ ప్రయోగాల కంటే సింపుల్ ఫ్యామిలీ మ్యాన్ గెటప్‌లోనే కోట్లు కొల్లగొడుతున్నాడు. అందులోనూ తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలతోనే కాసుల వర్షం కురిపిస్తున్నాడు. తుడరుమ్ సినిమాను రూ.30 కోట్లలోపే బడ్జెట్ కేటాయించగా రూ.100 క్లబ్‌లోకి చేరింది. ఈ లెక్కన చూస్తే తుడరుమ్ లాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు తీస్తే, చిన్న హీరోలైన, పెద్ద హీరోలైనా మంచి విజయాలు దక్కించుకోగలరు. ఇకపోతే, ఈ సినిమాతో మోహన్ లాల్ మరోసారి కంప్లీట్ స్టార్ అనిపించుకున్నాడు.