‘తెల్లవారుజామునే చీకటి’ అంటున్న మోహన్ లాల్

‘తెల్లవారుజామునే చీకటి’ అంటున్న మోహన్ లాల్

మలయాళ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన  చిత్రం ‘ఎల్‌‌ 2 ఎంపురాన్‌‌’. హీరో పృథ్విరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేయడంతోపాటు కీలకపాత్ర పోషించాడు. సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్‌‌‌‌’కు ఇది సీక్వెల్‌‌.  తమిళ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌‌ ఆశీర్వాద్ సినిమాస్‌‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. మార్చి 27న పాన్ ఇండియా వైడ్‌‌గా సినిమా విడుదల కానుంది.  

ఉదయం 6 గంటల నుంచే షోలు స్టార్ట్ కానున్నాయని ఆదివారం స్పెషల్ పోస్టర్‌‌‌‌తో టీమ్ ప్రకటించింది.  ‘తెల్లవారుజామున.. చీకటి అలుముకుంటుంది’ అంటూ క్యాప్షన్ ఇవ్వడం సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. ఇందులో  మోహన్ లాల్ ఖురేషి- అబ్రామ్ అలియాస్  స్టీఫెన్ నెడుంపల్లిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 

మంజు వారియ‌‌ర్,  టోవినో థామస్,  అభిమన్యు సింగ్, ఆండ్రియా తివాదర్, సూరజ్ వెంజరమూడు, ఇంద్రజిత్ సుకుమారన్, సాయికుమార్, బైజు సంతోష్, సచిన్ ఖేడ్కర్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.