మాఫియా డాన్‌‌‌‌గా మోహ‌‌‌‌న్ లాల్

మాఫియా డాన్‌‌‌‌గా మోహ‌‌‌‌న్ లాల్

మలయాళ సూపర్ స్టార్ మోహ‌‌‌‌న్ లాల్ హీరోగా వచ్చిన ‘లూసిఫర్‌‌‌‌‌‌‌‌’ చిత్రం  ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. పృథ్వీరాజ్ సుకుమారన్‌‌‌‌ డైరెక్షన్‌‌‌‌లో వచ్చిన ఈ చిత్రానికి ‘ఎల్‌‌‌‌2: ఎంపురాన్‌‌‌‌’ టైటిల్‌‌‌‌తో ప్రీక్వెల్ కూడా రూపొందిస్తున్నారు. మంగళవారం మోహన్ లాల్ బర్త్‌‌‌‌డే సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఇందులో మోహన్ లాల్ చుట్టూ బాడీ గార్డ్స్ ఉండగా, వారి మధ్యలో నుంచి స్టైలిష్‌‌‌‌గా నడుచుకుంటూ వస్తున్న స్టిల్ ఆకట్టుకుంది. 

ఫస్ట్ పార్ట్‌‌‌‌లో  రాజకీయ నాయకుడిగా కనిపించిన ఆయన..  పొలిటికల్ ఎంట్రీకి ముందు మాఫియా డాన్‌‌‌‌గా ఉన్నారు. స్టీఫెన్ నెడుంప‌‌‌‌ల్లి అస‌‌‌‌లు ఖురేషి అబ్రహామ్‌‌‌‌గా ఎలా మారాడ‌‌‌‌నే విష‌‌‌‌యాన్ని ఇందులో చూపించ‌‌‌‌బోతున్నారు. ఏది ఏమైనా  డాన్‌‌‌‌ గెటప్‌‌‌‌లో మాత్రం మోహన్ లాల్ మెస్మరైజ్ చేస్తున్నారు. 

మొదటి భాగంలో నటించిన మంజు వారియర్, టోవినో థామస్, ఇంద్రజిత్ సుకుమారన్ వంటి నటీనటులు ఇందులోనూ కనిపించనున్నారు. ప్రస్తుతం తిరువనంతపురంలో షూటింగ్ జరుగుతోంది. త్వర‌‌‌‌లోనే గుజరాత్, యుఎఈకి కూడా టీమ్ వెళ్లనుంది. ఆశీర్వాద్ సినిమాస్, లైకా ప్రొడక్షన్స్ కలిసి భారీ బడ్జెట్‌‌‌‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది పాన్ ఇండియా వైడ్‌‌‌‌గా సినిమా రిలీజ్‌‌‌‌కు ప్లాన్ చేస్తున్నారు.