కంటెంట్ నుంచి మేకింగ్ వరకు సౌతిండియన్ సినిమా స్థాయి పెరుగుతోంది. వరల్డ్ వైడ్‌గా మెప్పించగల యూనివర్సల్ కాన్సెప్ట్‌తో మన సినిమాలు వస్తున్నాయి. అందుకే 94వ ఆస్కార్ అవార్డ్స్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో సౌత్ నుంచి రెండు సినిమాలు నామినేట్ అయ్యాయి. అందులో మొదటిది సూర్య నటించిన తమిళ చిత్రం ‘జై భీమ్’. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా దీన్ని తెరకెక్కించారు టీజీ జ్ఞానవేల్. తన జీవితమంతా గిరిజనుల హక్కుల కోసం పోరాడిన లాయర్ చంద్రు క్యారెక్టర్‌ను సూర్య పోషించాడు. ఈ సినిమాని తనే నిర్మించాడు కూడా. ఓటీటీ ద్వారా విడుదలైన ఈ మూవీ దేశవ్యాప్తంగా కాంప్లిమెంట్స్ అందుకోవడంతో పాటు ఇటీవల ఆస్కార్స్ యూట్యూబ్ చానెల్‌లోనూ అప్‌లోడ్ అయింది. ఇప్పుడు ఆస్కార్‌కి నామినేట్ కూడా అయింది.
ఇక మోహన్‌లాల్ హీరోగా రూపొందిన పీరియాడికల్ చిత్రం ‘మరక్కార్’కి కూడా నామినేషన్ దక్కింది. పదహారో శతాబ్దానికి చెందిన కుంజలి మరక్కార్ జీవితం ఆధారంగా ప్రియదర్శన్ తీసిన ఈ సినిమా కమర్షియల్‌గా మెప్పించలేకపోయింది. కానీ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, కాస్ట్యూమ్ డిజైనర్, స్పెషల్ ఎఫెక్ట్ కేటగిరిల్లో నేషనల్ అవార్డ్స్ సాధించింది. ఇప్పుడిక ఆస్కార్ కోసం కూడా పోటీ పడుతోంది. ఈసారి ఆస్కార్‌కి పలు దేశాలకు చెందిన 276 సినిమాలు క్వాలిఫై అయ్యాయి. అందులో ఈ రెండూ ఉన్నాయి. ఫిబ్రవరి 8న ఆస్కార్ ఫైనల్ నామినేషన్ లిస్ట్ రివీల్ అవుతుంది. మార్చ్ 27న ఏబీసీ చానెల్‌లో అవార్డుల వేడుక టెలికాస్ట్ కానుంది.