మోహన్ లాల్ కొత్త సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్

మోహన్ లాల్  కొత్త సినిమా రిలీజ్ డేట్  అనౌన్స్

రీసెంట్‌‌గా ‘లూసిఫర్2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన మలయాళ స్టార్ మోహన్ లాల్ నుంచి మరో మూవీ రాబోతోంది. ఆయన హీరోగా నటించిన ‘తుడరమ్’ సినిమా రిలీజ్ డేట్‌‌ను సోమవారం ప్రకటించారు. వాస్తవానికి జనవరిలోనే విడుదల చేయాలని భావించినా.. ‘లూసిఫర్ 2’ ఉండటంతో కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వాలని వాయిదా వేశారు. ఫైనల్‌‌గాఈనెల  25న వరల్డ్‌‌వైడ్‌‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా   మోహన్ లాల్ స్పందిస్తూ.. ‘మీరందరూ గత కొన్ని రోజుల నుంచి ‘తుడరుమ్’ విడుదల విషయంలో వింటున్న రూమర్స్‌‌లో నిజం లేదు. 

ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 25న థియేటర్స్‌‌లోకి రానుంది’  అని పోస్ట్ చేశారు. అలాగే రిలీజ్ డేట్ పోస్టర్‌‌‌‌లో మోహన్ లాల్ లుక్ మెస్మరైజింగ్‌‌గా ఉంది. అంబాసిడర్  కారు పక్కన పంచెకట్టులో నిల్చొని ఉన్న ఆయన లుక్‌‌ సినిమాపై అంచనాలు పెంచుతోంది.  ఈ  క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌‌‌‌లో  ఆయన ట్యాక్సీ డ్రైవర్‌‌‌‌గా కనిపించనున్నారు. మోహన్‌లాల్‌కు జోడీగా శోభన నటించారు.  తరుణ్ మూర్తి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని  రెజపుత్ర విజువల్ మీడియా బ్యానర్‌‌పై ఎం.రెంజిత్ నిర్మిస్తున్నారు.  ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.