Mohini Dey: ఇటీవలే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తన భార్య సైరాభానుతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఏఆర్ రెహమాన్ విడాకులు ప్రకటించిన కొద్ది సేపటికే ప్రముఖ సింగర్, గిటార్ ప్లేయర్ మోహిని డే కూడా తన భర్త మార్క్ తో విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది.
దీంతో ఈ రెండు సంఘటనలని జోడిస్తూ ఏఆర్ రెహమాన్ గత కొన్నేళ్లుగా మోహినితో ప్రేమలో ఉన్నాడని అందుకే తన భార్య సైరాభానుతో విడాకులు తీసుకున్నాడని, త్వరలోనే ఏఆర్ రెహమాన్, మోహిని వివాహం చేసుకోబోతున్నారని పలు వార్తలు బలంగా వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ విషయంపై మోహిని డే సోషల్ మీడియా ద్వారా స్పందించింది.
ALSO READ | AR Rahman: 24గంటల్లో కంటెంట్ డిలీట్ చెయ్యకపోతే పరువునష్టం దావా వేస్తా..
ఇందులో భాగంగా ఏఆర్ రెహమాన్ తో తాను చిన్నప్పటి నుంచి కలసి పని చేస్తున్నానని మోహిని తెలిపింది. ఈ క్రమంలో గత 8.5 సంవత్సరాలలో ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానని, అలాగే ఏఆర్ రెహమాన్ నాకు గురువు, తండ్రిలాంటి వ్యక్తి అని స్పష్టం చేసింది. అయితే తమ ఇరువురి విడాకుల విషయాన్ని వక్రీకరించి కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఈ విషయం ఎంతగానో బాధించిందని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇక ఏఆర్ రెహమాన్ తో పెళ్లి గురించి స్పందిస్తూ అందులో ఎలాంటి వాస్తవం లేదని కొట్టి పారేసింది. అలాగే ఇప్పటికైనా తన గురించి తప్పుడు ప్రచారాలు ఆపాలని కోరింది. దీంతో దాదాపుగా ఏఆర్ రెహమాన్, మోహిని డే పెళ్లి చేసుకోబోతున్నట్లు వినిపిస్తున్న వార్తలకి పులిస్టాప్ పడిందని చెప్పవచ్చు.
ఈ విషయం ఇలా ఉండగా ఏఆర్ రెహమాన్ కూడా ఈ ఫేక్ న్యూస్ పై స్పందించాడు. ఇందులో భాగంగా నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్నవారిపై లీగల్ గా చర్యలు తీసుకుంటానని అన్నాడు. అలాగే 24 గంటల్లోగా తన గురించి పబ్లిష్ చేసిన కంటెంట్ ని డిలీట్ చేయాలని లేకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించాడు. ఈ క్రమంలో ఇప్పటికే పలు యూట్యూబ్ ఛానెల్స్, ఫేస్ బుక్ పేజ్ మేనేజర్స్ తదితరులకి లీగల్ నోటీసులు పంపంచినట్లు తెలుస్తోంది.