Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...

Mohini ekadashi 2024:  మోహిని ఏకాదశి రోజున  ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...

 హిందూమతంలో ఏకాదశి తిథికి ప్రత్యేక స్థానం ఉంది. వైశాఖ మాసంలో శుక్ల పక్షం పదకొండవ రోజున ఏకాదశి తిధిని( మే 19 )  మోహినీ ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ రోజున, మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తికి ప్రత్యేకంగా పూజిస్తారు. అంతేకాదు, మోహినీ ఏకాదశి రోజున (మే 19 )దానధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని జ్యోతిష్య నిపుణలు చెబుతున్నారు.  మోహినీ ఏకాదశి రోజున ( మే 19 ) దానధర్మాలు చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుందని, భక్తులందరికీ శుభఫలితాలు లభిస్తాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.  మోహినీ ఏకాదశి నాడు దానం చేయడం వల్ల పుణ్యం రావడమే కాకుండా జీవితంలో కష్టాలు తొలగి సుఖసంతోషాలు లభిస్తాయని నమ్ముతారు. ఆ రోజున పండితులు తెలిపిన వివరాల ప్రకారం  ఏఏ వస్తువులు దానం చేయాలో తెలుసుకుందాం. . .  .

హిందువులు మోహినీ ఏకాదశిని  ( మే19) చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు. వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఆచరిస్తూ ఉంటారు.  ఎవరైనా మోహినీ ఏకాదశి వ్రతాన్ని చేయవచ్చు. అంతేకాదు ఆ రోజున శక్తి మేరకు దానం చేయవచ్చు. అవసరంలో ఉన్న వ్యక్తికి విరాళం ఇవ్వవచ్చు. దానం చేసేటప్పుడు.. దానం చేసిన వస్తువుల స్వచ్ఛతను గుర్తుంచుకోండి. అలాగే దానధర్మాలు పుణ్యం పొందడానికే కాదు.. పేదవారికి సహాయం చేయడం కోసం అని కూడా గుర్తుంచుకోవాలి. ఏకాదశి ఉపవాసం దానం చేసిన తర్వాత మాత్రమే సంపూర్ణంగా పరిగణించబడుతుంది.

ఏ వస్తువులను దానం చేయవచ్చంటే

  • ధాన్యం: గోధుమలు, బియ్యం, పప్పులు, శనగలు మొదలైనవి.
  • పండ్లు: అరటి, ఆపిల్, నారింజ, ద్రాక్ష మొదలైనవి
  • బట్టలు: పసుపు బట్టలు
  • డబ్బు: దాతృత్వానికి డబ్బు
  • రాగి: రాగి సామాను
  • నెయ్యి: స్వచ్ఛమైన నెయ్యి
  • దుప్పటి: నిరు పేదలకు
  • మందులు: అవసరం ఉన్నవారికి, పేదలకు మందులు

ఎలా దానం చేయాలంటే

పురాణ శాస్త్రాల ప్రకారం దానం చేసే ముందు స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి. ముందుగా దానం చేసే వస్తువులను విష్ణుమూర్తికి సమర్పించండి. ఆ తర్వాత దానం చేయాలి. అంతేకాదు మీరు ఇచ్చిన వస్తువులను తీసుకున్న వ్యక్తిని గౌరవించండి. దానం చేసిన తర్వాత మనస్సులో మంచి ఆలోచనలు మాత్రమే చేయండి. మోహినీ ఏకాదశి నాడు దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. కోరికలు నెరవేరుతాయి. అంతేకాదు దానం చేయడం ద్వారా గ్రహాల స్థానాలు మంచిగా ఉంటాయి. సిరి సంపదలను పొందుతారు.

హిందూ మతంలో ఏకాదశి తిధి విష్ణువుకు అంకితం చేయబడింది. ఏకాదశి రోజున శ్రీ హరికి ప్రత్యేక పూజలు చేస్తారు. వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అని అంటారు. ఈ రోజుకి విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ ఏకాదశి రోజున విష్ణువు తో పాటు మోహిని అవతారాన్ని పూజిస్తారు. పాపాలు పోగొట్టుకుని సుఖ సంతోషాలతో జీవించాలని భక్తులందరూ మోహినీ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజున ఉపవాసం, పూజలు చేయడం ద్వారా భక్తులు  సుఖ సంతోషాలను పొందుతారు. . .