ఏసీసీ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌గా మోహ్సిన్‌‌‌‌‌‌‌‌ నఖ్వీ

ఏసీసీ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌గా మోహ్సిన్‌‌‌‌‌‌‌‌ నఖ్వీ

దుబాయ్‌‌‌‌‌‌‌‌: ఆసియా క్రికెట్‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌ (ఏసీసీ) కొత్త ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌గా పాక్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌ బోర్డు (పీసీబీ) చైర్మన్‌‌‌‌‌‌‌‌ మోహ్సిన్‌‌‌‌‌‌‌‌ నఖ్వీ గురువారం ఎన్నికయ్యారు. శ్రీలంక క్రికెట్‌‌‌‌‌‌‌‌ బోర్డు ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ షమ్మీ సిల్వా ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నఖ్వీ బాధ్యతలు చేపడతారు. 2027 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఏసీసీ ప్రెసిడెన్సీ సభ్య దేశాల మెంబర్లకు రొటేషన్‌‌‌‌‌‌‌‌ పద్ధతిలో వస్తుంది. ఇక కొత్తగా ఎన్నికైన నఖ్వీ ముందున్న అతిపెద్ద సవాల్‌‌‌‌‌‌‌‌.. మెన్స్‌‌‌‌‌‌‌‌ ఆసియా కప్‌‌‌‌‌‌‌‌ను నిర్వహించడం. 

టీ20 ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో జరిగే ఈ టోర్నీకి ఇంకా వేదికలను ఖరారు చేయలేదు. వాస్తవానికి ఈ టోర్నీకి ఇండియా ఆతిథ్యమివ్వాల్సి ఉంది. కానీ ఇండియా, పాక్‌‌‌‌‌‌‌‌ మధ్య దౌత్యపరమైన సమస్యలు ఉండటం వల్ల తటస్థ వేదికపై నిర్వహించాలని ఇంతకుముందే నిర్ణయించారు. ఆరు జట్లు పాల్గొనే ఆసియా కప్‌‌‌‌‌‌‌‌ను నిర్వహించే తటస్థ వేదిక ఏదనేది నఖ్వీ నిర్ణయించాల్సి ఉంది.