హైదరాబాద్ : కోకాపేట భూముల వేలం జోష్‌లో మరికొన్ని భూములను తెలంగాణ ప్రభుత్వం వేలం వేస్తోంది. ఆగస్టు 7వ తేదీన మోకిలా భూములకు వేలం పాట కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది.
రెండు సెషన్లలో 50 ప్లాట్లను తెలంగాణ సర్కార్ వేలం వేస్తోంది. సోమవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 25 ప్లాట్లకు వేలం వేసింది. మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంటకు వరకు మరో 25 ప్లాట్లకు వేలం వేస్తోంది.
మార్నింగ్ సెషన్ లో ఒక గజానికి అత్యధికంగా ఒక లక్షా 5 వేలకు కొనుగోలు జరిగింది. గజానికి సర్కార్ పెట్టిన ధర 25 వేలు మాత్రమే. కానీ, అంతకుమించి ఎక్కువ ధర పలికింది. మంగళవారం (ఆగస్టు 8న) షాబాద్ భూములకు కూడా కేసీఆర్ ప్రభుత్వం వేలం వేయనుంది.