హైదరాబాద్ సిటీ శివార్లలోని ఫాంహౌస్ లో జరిగిన పార్టీపై.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ బామ్మర్ధి రాజ్ పాకాలకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. 2024, అక్టోబర్ 28వ తేదీ ఉదయం.. గచ్చిబౌలిలోని ఆయన విల్లాకు నోటీసులు అంటించారు పోలీసులు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆయన.. వెంటనే పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని.. ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
Also Read :- అజ్ఞాతంలో రాజ్ పాకాల.. జన్వాడా ఫాంహౌజ్ కేసు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే
BNSS (భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) సెక్షన్ 35 (3) కింద నోటీసులు జారీ చేశారు పోలీసులు. జన్వాడ ఫాంహౌస్ లో లిక్కర్ బాటిళ్లు ఉండటం.. రేవ్ పార్టీ జరుగుతుందనే సమాచారంతో పోలీసులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ పార్టీలో డ్రగ్స్ వినియోగించారా లేదా.. పార్టీకి అనుమతి ఉందా లేదా ఇలాంటి విషయాలపై విచారణ చేయటం కోసం నోటీసులు జారీ చేశారు పోలీసులు.
జన్వాడ్ ఫాంహౌస్ లో పోలీసులు తనిఖీల సమయంలో కేటీఆర్ బామ్మర్ధి రాజ్ పాకాల పారిపోయినట్లు చెబుతున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే ఆయనకు నోటీసులు ఇచ్చారు.