MokshagnaTeja: మోక్ష‌జ్ఞ మూవీకి డైరెక్ట‌ర్‌ ఛేంజ్.. పుకార్ల‌పై క్లారిటీ ఇస్తూ మేకర్స్ నోట్ రిలీజ్

MokshagnaTeja: మోక్ష‌జ్ఞ మూవీకి డైరెక్ట‌ర్‌ ఛేంజ్.. పుకార్ల‌పై క్లారిటీ ఇస్తూ మేకర్స్ నోట్ రిలీజ్

బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ (Mokshagna) సినీ ఎంట్రీ ముహూర్తం జరిగిన విషయం తెలిసిందే. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో హీరోగా రంగవేప్రశం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ పోస్టర్స్ కూడా రిలీజ్ చేసి క్యూరియాసిటీ పెంచేశాడు.

అయితే.. సోషల్ మీడియాలో నెటిజన్లు.. సీన్ రివర్స్ చేస్తూ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు. 'సినిమా ఆగిపోయిందని.. మోక్షజ్ఞ డెబ్యూ డైరెక్టర్ మారిపోయాడని.. కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్తో మోక్షు ఎంట్రీ ఉంటుందని..' ఇలా పలు రకాలుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. 

ఈ క్రమంలో మేకర్స్ సోషల్ మీడియాలో వస్తోన్న రూమర్స్ని అమాంతం కొట్టిపడేశారు. తాజాగా క్లారిటీ ఇస్తూ మేకర్స్ నోట్ రిలీజ్ చేశారు. నిర్మాణ సంస్థ ఎస్ఎల్‌వీ సినిమాస్ క్లారిటీ ఇస్తూ.. "మోక్ష‌జ్ఞ తేజ, ప్ర‌శాంత్ వ‌ర్మ సినిమాపై వ‌స్తోన్న ఊహాగానాల్లో నిజం లేద‌ని.. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను రివీల్ చేస్తామ‌ని, అస‌త్యాల్ని న‌మ్మ‌వ‌ద్ద‌ని, ప్ర‌చారం చేయ‌ద్ద‌ని" నోట్ లో వెల్లడించింది. 

ALSO READ : Viduthalai Part 2: అసామాన్యుడి కథ విడుదల 2..విజయ్‌సేతుపతి పాత్ర ఎలా ఉండబోతుంది?

అయితే, ఇటీవలే మోక్ష‌జ్ఞ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నాడని చెప్పిన విషయం తెలిసిందే. అందుకే డిసెంబర్ ఫస్ట్ వీక్లో లాంచ్ కావాల్సిన ఈ మూవీ ఆగిపోవడానికి కారణం అయిందని సమాచారం. అయితే, మేకర్స్ ముందుగానే లాంఛింగ్ డేట్‌, ప్లేస్ ఫిక్స్ చేశారు. కానీ చివ‌రి నిమిషంలో సినిమా ఓపెనింగ్ ఈవెంట్‌ను క్యాన్సిల్ చేశారు.

దాంతో మోక్షజ్ఞ సినిమా ఆగిపోయిందని.. నాగ్ అశ్విన్ తో సినిమా ఉంటుందని.. ఇలా పలు రకాలుగా వినిపిస్తూ వచ్చింది. ఇక తాజాగా నిర్మాణ సంస్థ ఎస్ఎల్‌వీ సినిమాస్ క్లారిటీ ఇవ్వడంతో సూపర్ హీరో కథకు అంత సిద్దమనే క్లారిటీ వచ్చింది. త్వరలో ఈ సినిమా లాంచింగ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది.