నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. ‘హనుమాన్’లాంటి సూపర్ హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మ దీనికి దర్శకుడు. ‘సింబా ఈజ్ కమింగ్’ అంటూ మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో స్టైలిష్ లుక్‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు మోక్షజ్ఞ. ‘వెల్ కమ్ టు ద ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్... నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజను ఇంట్రడ్యూస్ చేయడం సంతోషంగా ఉంది’ అంటూ ప్రశాంత్ వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
మైథలాజికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్టు తెలియజేశారు. బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. టైటిల్‌తో పాటు ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తామన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సోషల్ మీడియా ద్వారా మోక్షజ్ఞకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే నందమూరి అభిమానులు మోక్షజ్ఞకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు.