తాతకు మనవరాలి ఫోన్ కాల్ ..! నాను, మమ్మీ మర్ గయా..ఆకలిగా ఉంది త్వరగా రా

తాతకు మనవరాలి ఫోన్ కాల్ ..! నాను, మమ్మీ మర్ గయా..ఆకలిగా ఉంది త్వరగా రా

వారిద్దరు భార్య – భర్తలు. వారికో మూడేళ్ల కుమార్తె. ఓ రోజు మీరు కూడా పెళ్లికి  రావాలి అంటూ భార్య తరుపు బంధువులు ఆ దంపతుల్ని ఆహ్వానించారు. ఆహ్వానించే విషయంలో భార్యభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. విభేదాల్ని పట్టించుకోని భార్య శుభకార్యానికి వెళ్లి వచ్చింది. అంతే ఫంక్షన్ కు రావాలని సరిగ్గా  పిలవలేదు. అయినా నామాట పట్టించుకోకుండా ఫంక్షన్ కు వెళ్లివస్తావా అంటూ భార్యపై భర్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి.

అయితే శనివారం అర్ధరాత్రి ఆ ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మూడేళ్ల కుమార్తె ఆ శవాలతో 11గంటల పాటు గడిపింది.  11గంటల తరువాత చిన్నారి తన తాతకు ఫోన్ చేసి ఇలా.. తాతా పాపా భీ మర్ గయా, హౌర్ ముజే భోత్ భూక్ లగాహై. జల్ది ఆజా అంటూ కోరింది.  మనవరాలి  ఫోన్ కాల్ తో షాక్ తిన్న తాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ హృదయ విషాదకర సంఘటన భూపాల్ లో చోటు చేసుకొంది.  మధ్యప్రదేశ్  భూపాల్ కి చెందిన అభయ్ దంపతుల కుమారుడు సత్యేంద్ర బహోదురియా అతని భార్య అషు. వారికి మూడుసంవత్సరాల కుమార్తె. జులాయిగా తిరుగుతున్న సత్యేంద్ర కుటుంబాన్ని అతని తల్లిదండ్రులు , అన్నదమ్ములు పోషిస్తున్నారు. కుటుంబ అవసరాల కోసం సత్యేంద్ర అన్నదమ్ముల మీద ఆధారపడేవాడు. జులాయిగా తిరుగుతున్న సత్యేంద్ర కోసం వారి తల్లిదండ్రులు రీసెంట్ గా ఇల్లు, కారు కొనిచ్చినట్లు తెలుస్తోంది.

ఓ పెళ్లికి ఆహ్వానించే విషయంలో సత్యేంద్ర.. భార్య తరుపు బంధువులపై గుర్రుగా ఉన్నాడు. అదే విషయంలో భార్యభర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. చీటికి మాటికి గొడవపడేవారు. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి వారి స్వగృహంలోనే  ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.

వారి మూడేళ్లే కుమార్తె శవాలతో 11 గంటల పాటు గడిపింది.  తల్లిదండ్రులు మరణించడం, ఇంట్లో ఇతర కుటుంబ సభ్యులెవరూ లేకపోవడంతో చిన్నారి ఆకలితో అలమటించింది. తట్టుకోలేక రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తన తాత కు ఫోన్ చేసింది. తాత..! అమ్మా,నాన్న ఇద్దరు చనిపోయారు. నాకు ఆకలిగా ఉందంటూ మూడేళ్ల చిన్నారి చెప్పడంతో  తాత అభయ్ షాక్ కు గురయ్యాడు. మనవరాలు ఫోన్ చేసి ఇలా మాట్లాడిదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..అనుమానాస్పద స్థితిలో సత్యేంద్ర బహోదురియా అతని భార్య అషు నిర్జీవంగా ఉండటాన్ని గుర్తించారు.

సత్యంద్ర దంపతుల మరణంపై అతని కుటుంబసభ్యులు, బంధువులు స్పందించారు. ఫంక్షన్ విషయంలో ఇద్దరు గొడవపడేవారని తెలిపారు.

మనస్పర్ధల వల్లే ఆత్మహత్య చేసుకున్నారా..? ఆస్తికోసం ఇంకెవరైనా ఈ దురాగతానికి పాల్పడ్డార అన్న కోణంలో అనుమానాస్పదంగా మృతిగా కేసు నమోదు చేసుకున్నామని,… బంధువుల స్టేట్మెంట్, మూడేళ్ల కుమార్తె ఫోన్ కాల్ ఆధారంగా విచారణ ప్రారంభించినట్లు ఎస్పీ నవనీత్ బాసియన్ మీడియాకు  వెల్లడించారు.