VenkyAnil3: ‘వెంకీ మామ’సెట్లో..బాలయ్య బాబు హుషారైన సందడి..వీడియో వైరల్

VenkyAnil3: ‘వెంకీ మామ’సెట్లో..బాలయ్య బాబు హుషారైన సందడి..వీడియో వైరల్

ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్లెంట్  వైఫ్.. అంటూ ఈ సారి ఎక్స్టార్డినరీ ట్రాంగులర్ క్రైం థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు విక్టరీ వెంకీ. డైరెక్టర్ అనిల్ రావిపూడితో మరోసారి జతకట్టనున్న వెంకీ మామ..ఎంటర్టైన్మెంట్ లెవల్ పీక్స్ ఉండేలా ఈ సక్సెస్ కాంబో సిద్ధమైంది.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ (SVC 58) నుంచి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. షూటింగ్ కూడా చక చకా నడుస్తోంది. ఇందులో భాగంగా ఇటీవలే పొల్లాచ్చిలో లెన్తీ, క్రూసియల్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేసుకున్నమేకర్స్..ప్రస్తుతం హైదరాబాద్‌లోని RFCలో న్యూ షూటింగ్ షెడ్యూల్‌తో బిజీగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో #వెంకీఅనిల్3 సెట్స్‌ లోకి ప్రత్యేక అతిథి వచ్చారు. RFCలో లేటెస్ట్ షెడ్యూల్‌లో నటసింహం నందమూరి బాలకృష్ణ  సెట్స్‌ లో సందడి చేశారు. ఈ ఆన్-లొకేషన్ స్టిల్స్‌లో బాలకృష్ణ, వెంకటేష్, అనిల్ రావిపూడి మధ్య ఎలాంటి బాండింగ్ నెలకొందో చూస్తే అర్ధమైపోతుంది. ఒకరికొకరు పలకరింపులు, ఆ చిరునవ్వులు ఇరువురి ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా ఉన్నాయి. ఇక బాలయ్య రాకతో టీం చాలా థ్రిల్‌ అయ్యింది. అయితే ఇండస్ట్రీలో బాలయ్య, వెంకటేష్ మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే.

ఈ మేరకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.. స్పెషల్ వీడియో షేర్ చేస్తూ.."నటసింహం నందమూరి బాలకృష్ణ గారితో #వెంకీఅనిల్3 సెట్స్ నుండి అద్భుతమైన క్షణాలు..థియేటర్లలో సంక్రాంతి 2025లో కలుద్దాం" అని పోస్ట్ చేశారు. అలాగే సంక్రాంతి సెంటిమెంట్ కలిసొచ్చేలా 'సంక్రాంతికి వస్తున్నాం' అనే టైటిల్ను ఫిక్స్ చేశారట మేకర్స్. 

వెంకీ అనిల్’ 03మూవీని 2025 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయడానికి సన్నహాలు చేస్తున్నారు. అయితే, ఈ పండుగకు బాబీ డైరెక్షన్ లో బాలయ్య బాబు నటిస్తున్న 109 వ సినిమా కూడా రానున్నట్లు సమాచారం. వీటికి పోటీగా మెగాస్టార్ విశ్వంభర మూవీ కూడా రానుంది.

  • Beta
Beta feature