IND vs BAN 2nd Test: హిట్ మ్యాన్ కెప్టెన్సీ అదిరింది.. ఫీల్డ్ సెట్‌లో రోహిత్ మ్యాజిక్

IND vs BAN 2nd Test: హిట్ మ్యాన్ కెప్టెన్సీ అదిరింది.. ఫీల్డ్ సెట్‌లో రోహిత్ మ్యాజిక్

కాన్పూర్ టెస్టులో చివరి రోజు రోహిత్ శర్మ తనదైన కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. బంగ్లాదేశ్ ను త్వరగా ఆలౌట్ చేయడంలో రోహిత్ తీసుకున్న నిర్ణయాలు.. చేసిన మార్పులు ఫలించాయి. ముఖ్యంగా ఫీల్డ్ సెట్ లో అదరగొట్టాడు. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మోమినుల్ హక్ కు అద్భుతమైన ఫీల్డ్ సెట్ ను విధించాడు. మోమినుల్ పదే పదే స్వీప్ షాట్ కు ప్రయత్నిస్తుంటే రోహిత్ తన వ్యూహాలను మార్చాడు. అశ్విన్ బౌలింగ్ లో చుట్టూ ఫీల్డర్లను ఉంచాడు. అటాకింగ్ ఫీల్డ్ సెట్ తో ఒత్తిడిలో పడేశాడు.

స్లిప్, షార్ట్ కవర్, షార్ట్ లెగ్, లెగ్ స్లిప్ లో ఫీల్డర్లను ఉంచాడు. దీంతో మోమినుల్ హక్ తీవ్ర ఒత్తిడిలో లెగ్ స్లిప్ లో రాహుల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. సాధారణంగా లెగ్ స్లిప్ లో ఫీల్డర్ ను ఉంచడం అరుదు. కానీ రోహిత్ నిర్ణయం ఫలించింది. అంతేకాదు బౌలింగ్ కు జడేజాను సరైన సమయంలో తీసుకొచ్చాడు. అతను ఐదో రోజు తన తొలి ఓవర్లోనే రెండో బంతికి శాంతోను ఔట్ చేశాడు. దీంతో రోహిత్ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ రోహిత్ కెప్టెన్సీని కొనియాడాడు.     

ALSO READ | IND vs BAN 2nd Test: అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు: కాన్పూర్ టెస్టులో టీమిండియా అద్భుత విజయం

ఈ మ్యాచ్ విషయానికి వస్తే చివరి రోజు బంగ్లాదేశ్ విధించిన 95 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 3 వికెట్లు కోల్పోయి 14 ఓవర్లలో ఛేజ్ చేసింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (40), కోహ్లీ (24) జాగ్రత్తగా ఆడి భారత్ కు విజయాన్ని అందించారు. రోహిత్ (8), గిల్ (6) విఫలమయ్యారు. దీంతో భారత్ సిరీస్ ను 2-0 తేడాతో గెలుచుకుంది. తొలి మూడు రోజుల తర్వాత డ్రా ఖాయమన్న దశలో చివరి రెండు రోజులు రోహిత్ సేన అసాధారణంగా పోరాడి గెలిచింది.