"సవార్ లూన్" మరియు "మోహ్ మోహ్ కే ధాగే" వంటి సూపర్ హిట్ సాంగ్స్ శ్రోతలకు సుపరిచితం. ఆ పాటలు పాడిన బెంగాలీ సింగర్ మోనాలీ ఠాకూర్(Monali Thakur) తీవ్ర అస్వస్థకు గురైంది.
జనవరి 21న పశ్చిమ బెంగాల్‌లో జరిగిన లైవ్ ఈవెంట్‌లో శ్వాస తీసుకోవడంలో సింగర్ మోనాలీ ఇబ్బంది ఎదుర్కొందని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా, వెంటనే మోనాలీ ఠాకూర్ను దిన్‌హటాలోని గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారని, ఆ తర్వాత అక్కడ నుండి కూచ్ బెహర్ నగరంలోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చింది.
ALSO READ | Chhaava Trailer Review: ఛావా ట్రైలర్ X రివ్యూ.. విక్కీ,రష్మిక నటన గూస్‌బంప్స్
అయితే, తాను వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా మాత్రమే అస్వస్థతకు గురయ్యానని.. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడట్లేదని ఇన్స్టా వేదికగా సింగర్ మోనాలీ తెలిపింది. ఈ మేరకు తనకు శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నాయని మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని.. అవన్నీ రూమర్స్ అని స్పెషల్ నోట్ రాసి క్లారిటీ ఇచ్చింది.
"ఈ సందర్భంగా తాజాగా జనవరి 23న తన ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలను నమ్మవద్దని మీడియా మరియు అభిమానులను అభ్యర్థించింది. అయితే, వైరల్ ఇన్‌ఫెక్షన్/ఫ్లూ వల్లే అస్వస్థతకు గురయ్యాను. ముఖ్యంగా విమానాల్లో ప్రయాణించడం వల్ల అది కాస్తా ఎక్కువైంది. దాంతో తీవ్రమైన సైనస్ మరియు మైగ్రేన్ అసౌకర్యానికి దారితీసిందని తెలిపింది. అలాగే, సోషల్ మీడియాలో తనపై ఫ్యాన్స్ చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు. అయితే, ప్రస్తుతం కోలుకుంటున్న. అందుకు ఏ ఆసుపత్రిలో చేరలేదని స్పష్టం చేసింది" సింగర్ మోనాలీ.