మహా కుంభమేళా.. పవిత్ర స్నానాలు, పిండ ప్రదానాలు ఇలా ఆధ్యాత్మిక శోభకు పుట్టిల్లు.. ఇప్పుడు అది కాస్తా మరో ఆసక్తికర చర్చకు తెర తీసింది. కుంభమేళాలో బ్యూటీ హంటింగ్స్ మొదలయ్యాయి.. మొన్నటికి మొన్న ఇండోర్ కు చెందిన ఓ మహిళ.. పూసలు అమ్ముతూ అందర్నీ ఆకట్టుకుంది. ఆ యువతి అందం సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇండోర్ మోనాలిసా అంటూ పేరు పెట్టేసి.. తెగ రచ్చ చేసేశారు. చివరకు సినిమా అవకాశాలు అంటూ ఎవరికి తోచింది వాళ్లు కథలు అల్లేశారు. ఇండోర్ మోనాలిసా తర్వాత.. ఇప్పుడు మరో యువతి ఫొటో వైరల్ అయ్యింది.. ఆ యువతి కూడా ఇండోర్ నుంచే వచ్చింది. ఈ యువతి పేరు మీనా.. మొన్న మోనాలిసా.. ఇప్పుడు మీనా.. కుంభమేళాలో వీళ్లతో సెల్ఫీలు తీసుకోవటానికే కుర్రోళ్లు ఎగబడుతున్నారంట.
कुंभ मेले में एक और खानाबदोश जनजाति की महिला अपने खूबसूरती के कारण वायरल हुई.
— Kranti Kumar (@KraantiKumar) January 18, 2025
ADANI, AMBANI, TATA और BIRLA की तरह ये महिला भी व्यापारी है. फर्क केवल रकम में है. वे लाखों करोड़ों का टर्नओवर करते हैं,
यह महिला माला कंठी बेचकर रोज 500 या 1000 रुपए का टर्नओवर करती है.
महिला… pic.twitter.com/9fp4OINJQV
ఇండోర్ కు చెందిన ఓ మహిళ మాలలు ( పూసల దండలు) అమ్ముతున్న మోనాలిసా అనే యవతి కుంభమేళాలో అట్రాక్టివ్ అయింది. ఆమె కళ్లు.. హెయిర్ స్టైల్ జనాలను ఎంతగానో ఆకట్టుకుంది. ఆమె లుక్‌లో ఉన్న ఆ చక్కని చిరునవ్వు, చూస్తే చూడాలనిపించే అందం, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రస్తుత కుంభమేళలో ఆమె ఫొటోలు, వీడియోలు తెగ వైరల్‌గా మారాయి. ఆమెకు సంబంధించిన వీడియో ఒకటి అనుకోకుండా ఏకంగా 15 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. మహా కుంభమేళాలో తన మాలను అమ్ముతూ రోజుకు రూ. 2వేల నుండి రూ. 3 వేలు సంపాదిస్తున్నట్లు ఆమె పంచుకుంది. ఫిబ్రవరి 2025లో ముగిసే ఈవెంట్ ముగిసేలోగా రూ. 1.5 లక్షలకు పైగా సంపాదించాలనే తన ఆశను కూడా ఆమె వెల్లడించింది. ఆమెపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు, ఆమె అందం, కళ్లు గురించి రాశారు.
दुनिया की सबसे खूबसूरत आँखों वाली लड़की 😍❤️
— Lakhan meena (@563deshbhakt) January 20, 2025
रील पर अर्धनग्न होने वाले इस दौर मे,
वो अपनी सादगी से ही वायरल हो गई..❤️🌻#mahakumbh #monalisa #viralgirl #kumbh pic.twitter.com/jAr7Zis3Op
ఈ అందం ఖచ్చితంగా సినిమా వాళ్ల దృష్టిలో పడుతుందని సినిమా చాన్సులు వస్తాయని.. ఇవ్వాలని నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆమెకు లభించిన పబ్లిసిటీతో చాలా మంది ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో వ్యాపారం జరగడం లేదని గమనించిన తండ్రి కుమార్తెను తిరిగి మధ్యప్రదేశ్, ఇండోర్‌లోని ఇంటికి పంపించేశాడు.