హైదరాబాద్‌లో మోనార్క్​ ట్రాక్టర్స్​ టెస్టింగ్​ ఫెసిలిటీ

హైదరాబాద్‌లో మోనార్క్​ ట్రాక్టర్స్​ టెస్టింగ్​ ఫెసిలిటీ

హైదరాబాద్, వెలుగు: హైద‌‌రాబాద్‌‌లో త‌‌మ సంస్థ విస్తర‌‌ణ‌‌కు మోనార్క్ ట్రాక్టర్స్ సంస్థ ముందుకు వ‌‌చ్చింది. నగరంలోని తమ ప‌‌రిశోధ‌‌న, -అభివృద్ధి సంస్థ (ఆర్​ అండ్​ డీ)ను విస్తరించే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందంతో మోనార్క్ ట్రాక్టర్స్​ సంస్థ ప్రతినిధులు చ‌‌ర్చించారు.  అనంత‌‌రం  హైదరాబాద్‌‌లో త‌‌మ ఆర్ అండ్ డీ సంస్థకు అనుబంధంగా స్వయం ప్రతిపత్తి ట్రాక్టర్ టెస్టింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు సీఎం రేవంత్​బృందానికి లేఖ ఇచ్చారు. 

హైటెక్, పర్యావరణ అనుకూల కంపెనీలను ఆకర్షించడంపై తాము దృష్టిసారించామ‌‌ని, మోనార్క్ ట్రాక్టర్స్‌‌ను తెలంగాణ‌‌కు ఆహ్వానిస్తున్నామ‌‌ని సీఎం  రేవంత్ రెడ్డి  తెలిపారు. స్వయం ప్రతిపత్తి , ఎలక్ట్రిక్ వాహనాల సాంకేతికతలో తెలంగాణను అగ్రగామిగా నిలిపామ‌‌ని, ఆ విజ‌‌న్‌‌లో మోనార్క్ ట్రాక్టర్స్ భాగ‌‌మై.. రాష్ట్రంలో తమ ఉనికిని విస్తరించుకోవాల‌‌ని ఆశిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో త‌‌మ కార్యక‌‌లాపాలపై  చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డిని, ఇత‌‌ర అధికారుల‌‌ను క‌‌ల‌‌వ‌‌డం ఎంతో  సంతోషం క‌‌లిగించిద‌‌ని మోనార్క్  ట్రాక్టర్స్ సీఈవో ప్రవీణ్ పెన్మెచ్చ వెల్లడించారు. 

హైదరాబాద్‌‌లోని త‌‌మ ఆర్​అండ్​డీ కేంద్రం అధునాతన డ్రైవర్- ఆప్షన్ స్మార్ట్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్లను రూపొందించడంలో కీలకపాత్ర పోషించింద‌‌ని చెప్పారు. తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించేందుకు తాము చూస్తున్నామ‌‌ని,  ఫ‌‌లితంగా హైద‌‌రాబాద్ ప్రాంతంలో మ‌‌రింత ఉత్పత్తి, ఉపాధి  అవ‌‌కాశాలు వ‌‌స్తాయ‌‌ని తెలిపారు. ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి స్వయంప్రతిపత్తి, డ్రైవర్, డ్రైవ‌‌ర్ లెస్​  స్మార్ట్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్లతో మోనార్క్ ట్రాక్టర్స్ సాగు రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నది. 

 ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్ ​కన్సల్టెంట్​తో సీఎం భేటీ  

అమెరికా పర్యటనలో భాగంగా కాలిఫోర్నియా బే ఏరియాలో జరిగిన బిజినెస్ కాన్ఫరెన్స్‌‌లో ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్ కన్సల్టెంట్, రచయిత,  డాక్టర్ రామ్ చరణ్ తో సీఎం రేవంత్ రెడ్డి  భేటీ అయ్యారు.  హైదరాబాద్‌‌ను సందర్శించాలని, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను పరిశీలించాలని, అవి విజయవంతం అయ్యేందుకు అవసరమైన సూచనలు చేయాలని కోరారు. 

రామ్ చరణ్  అనుభవం తెలంగాణ పురోగతికి తోడ్పడుతుందని సీఎం రేవంత్​ అభిప్రాయపడ్డారు. కాగా, అమెరికా వ్యాపార ప్రపంచంలో రామ్​చరణ్​ 40 ఏండ్లుగా   కీలకమైన ఇన్‌‌ఫ్లుయెన్సర్‌‌గా, పలు అగ్రశ్రేణి కంపెనీల సీఈవోలు, బోర్డులతో పనిచేశారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా, టయోటా, నోవార్టిస్, జనరల్ ఎలక్ట్రిక్, యూఎస్​టీ గ్లోబల్, ఫాస్ట్ రిటైలింగ్, కేఎల్ఎం ఎయిర్‌‌లైన్స్, మ్యాట్రిక్స్‌‌ సహా ప్రపంచంలోని అగ్రశ్రేణి సంస్థలకు డాక్టర్ రామ్ చరణ్  కన్సల్టెంట్ గా ఉన్నారు. డజన్ల కొద్దీ గ్లోబల్ లీడర్లకు శిక్షణ ఇచ్చి, పలు కంపెనీలకు వ్యాపార సలహాదారుగా ఉంటూనే 30కిపైగా పుస్తకాలు రాశారు. 

 గూగుల్​ హెడ్​క్వార్టర్స్​లో సీఎం

కాలిఫోర్నియాలోని గూగుల్‌‌ హెడ్​క్వార్టర్స్​ను  సీఎం  రేవంత్​రెడ్డి సందర్శించారు. రాష్ట్ర అభివృద్ధిలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, ఏఐ, స్కిల్లింగ్​ అంశాలపై  ఆ సంస్థ ప్రతినిధులతో  చర్చలు జరిపారు. గూగుల్ ​హెడ్​ ఆఫీస్​ను​ విజిట్ చేయడం సంతోషంగా ఉన్నదని సీఎం రేవంత్​ చెప్పారు. ఆయన వెంట మంత్రి శ్రీధర్‌‌బాబు, ఐటీ, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు.