ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌చేస్తూ కార్మిక సంఘాలు సోమవారం చేపట్టిన ధర్నాలతో ఆదిలాబాద్ కలెక్టరేట్దద్దరిల్లింది. లెప్రసీ సర్వే నిర్వహించిన ఆశా వర్కర్ల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేయాలని, గ్రామ పంచాయతీ కార్మికుల 6 నెలల పెండింగ్వేతనాలు చెల్లించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
జీఓ నంబర్60 ప్రకారం రిమ్స్కార్మికులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుముట్టడించారు. తమ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భగత్‌సింగ్‌నగర్ వాసులు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్ రాజర్షి షాకు వినతి పత్రాలు అందజేశారు. ధర్నాలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆశన్న, ఆయా సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.