కమలాపూర్/ హసన్‌పర్తి/ పరకాల, వెలుగు : ముదిరాజ్‌లకు కౌశిక్‌రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ సోమవారం ఆందోళనకు దిగారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్‌లో, హసన్‌పర్తి మండలం నాగారం, పరకాలలో కౌశిక్‌రెడ్డి దిష్టిబొమ్మ, ఫ్లెక్సీతో శవయాత్ర నిర్వహించారు.
ALSO READ: కొత్తగూడెంలో నీటి ఎద్దడి లేకుండా చేయాలి: కలెక్టర్ అనుదీప్
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఉప్పల్‌లో ర్యాలీకి పర్మిషన్ లేదంటూ పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా ముదిరాజ్‌లు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో వారు రోడ్డుపైనే బైఠాయించి పోలీసులు, ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.