ఏటూరునాగారం, వెలుగు : ములుగు జిల్లా వెంకటాపురం మండలం చిరుతపల్లి జీపీఏస్‌కు మరో టీచర్‌ను కేటాయించాలంటూ సోమవారం పేరెంట్స్ ఐటీడీఏ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్కూల్‌లో మొత్తం 51 మంది స్టూడెంట్లు ఉంటే టీచర్ మాత్రం ఒక్కరే ఉన్నారన్నారు. మరో టీచర్‌ను నియమించాలని కోరారు. అయితే పీవో అంకిత్ ఏం మాట్లాడకుండా వెళ్లిపోవడంతో పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరో టీచర్‌ను కేటాయించాలని నాలుగు నెలలుగా కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడంలో పీవో విఫలం అయ్యారని ఆరోపించారు. ఇప్పటికైనా స్పందించి మరో టీచర్‌ను కేటాయించాలని కోరారు. ధర్నాలో సర్పంచ్ నర్సింహమూర్తి, ఆదివాసీ నవనిర్మాణ సేన నాయకులు మహేశ్, ఇర్ప బాబు, గోవర్ధన్, శివ, గోపి పాల్గొన్నారు.