దుర్గామాత మండపాల్లో వివేక్ వెంకటస్వామి పూజలు

చెన్నూరు, వెలుగు: దేవీ నవరాత్రులను పురస్కరించుకొని చెన్నూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలను సోమవారం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ డాక్టర్ వివేక్ వెంకటస్వామి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. దసరా ఉత్సవాలను అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా మండప నిర్వాహకులు వివేక్​ వెంకటస్వామిని ఘనంగా సన్మానించారు. ఆయన వెంట బీజేపీ లీడర్లు అందుగుల శ్రీనివాస్, వెంకటేశ్​ గౌడ్, వెంకన్న, సుశీల్, శ్రీకాంత్, మహేశ్, శివ తదితరులున్నారు.