లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరుతో డబ్బులు వసూలు

లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరుతో డబ్బులు వసూలు
  • ఏడుగురిని అదుపులోకి తీసుకున్న వనపర్తి పోలీసులు
  • ధని లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాప్ పేరిట రూ. 2 కోట్లు వసూలు చేసినట్లు గుర్తింపు

వనపర్తి, వెలుగు : లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తులను వనపర్తి పోలీసులు అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ రావుల గిరిధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోమవారం మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... వనపర్తి పట్టణానికి చెందిన తొగుట రాజు గతేడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 17న తన ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ధని లోప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన పేజీ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. వెంటనే ఓ వ్యక్తి ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావాలా ? అని అడగడంతో రూ.3 లక్షలు కావాలని రాజు చెప్పాడు. రూ. 3 లక్షల లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకుంటే ప్రతి నెల 8,860 చొప్పున 36 నెలలు కట్టాల్సి ఉంటుందని గుర్తు తెలియని వ్యక్తి చెప్పడంతో రాజు ఒప్పుకున్నాడు.

దీంతో మొదటగా ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం రూ. 6,850, లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదటి ఈఎంఐ కింద రూ. 8,860ను తాము పంపించే స్కానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తే రాత్రి వరకు డబ్బులు బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డిపాజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతాయని చెప్పడంతో నిజమేనని నమ్మిన రాజు డబ్బులు సెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డబ్బులు పడకపోవడంతో రాజు మరుసటి రోజు సదరు గుర్తుతెలియని వ్యక్తికి ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయగా మరికొంత అమౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పే చేయాల్సి ఉంటుందని చెప్పడంతో రాజు తన వద్ద డబ్బులు లేవని చెప్పాడు. ఆ తర్వాత సదరు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన రాజు సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రైం 1930కు ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. తర్వాత డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 21న వనపర్తి టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదుచేసిన సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ రత్నం, సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీం ఎస్సై రవిప్రకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సీఐ కృష్ణయ్య, టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్సై హరిప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఎంక్వైరీ స్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. మొత్తం 35 మంది కలిసి ధని యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోన్ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నట్లు నిర్ధారించారు. ఇందులో బీహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన అంకిత్, రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పంకజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రధాన సూత్రధారులు కాగా, వారికి వనపర్తి జిల్లా గోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట మండలం మున్ననూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన సోడె కృష్ణకుమార్, కొత్త ఆంజనేయులు, జనంపల్లి నితీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, సోడే భాను, పాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలం మల్లాయిపల్లికి చెందిన దోసల నవీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, వనపర్తి పట్టణం గాంధీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఆగుపోగు మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జోగులాంబ గద్వాల జిల్లా హౌసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డుకు చెందిన మోరెడ్డి ఉదయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి సహకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

లోన్ల పేరుతో పలువురిని మోసం చేసి రూ. 2 కోట్ల మేర వసూలు చేశారని ఎస్పీ చెప్పారు. వనపర్తి, గద్వాల జిల్లాకు చెందిన ఏడుగురిని అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి రిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపించామని, వారి వద్ద నుంచి ఆరు మొబైల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నాలుగు బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకున్న పోలీసులను క్యాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రివార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో అభినందించారు.