ఏటీఎంలో డబ్బు కొట్టేదామంటే.. కాలి బూడిదైంది

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో  రూ. 8.12 లక్షల నగదు దగ్ధమైంది.  గత రాత్రి ఏటీఎంలో ఉన్న నగదును చోరీ చేసేందుకు దుండగులు యత్నించారు. కానీ అందులో డబ్బు లేదనుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ వారు వెళ్లిపోయిన  కొద్దిసేపటికే ఆ ఏటీఎంలో షాక్ సర్క్యూట్ జరగడంతో డబ్బంతా కాలి బూడిదైంది.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.