
మెదక్ (శివ్వంపేట), వెలుగు : సీనియర్ అడ్వకేట్, రాష్ట్ర బార్ కౌన్సిల్ మాజీ చైర్మన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ రాజేందర్ రెడ్డి శివ్వంపేటలోని భగులాముఖి శక్తిపీఠం ఆలయానికి రూ.30 లక్షల విరాళం ప్రకటించారు. గురువారం ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తొలి విడతగా రూ.5 లక్షలు అందజేశారు.
ఆలయ వ్యవస్థాపకులు శాస్త్రుల వెంకటేశ్వరశర్మ ఆయనకు ఆశీర్వచనాలు చేశారు.ఈ సందర్భంగా రాజేందర్రెడ్డి వెంట హైకోర్టు అడ్వకేట్శివకుమార్ గౌడ్, జడ్పీటీసీ పబ్బ మహేశ్గుప్త, స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు.