మనదేశంలో ఎన్నికలు ఖర్చుతో కూడిన వ్యవహారం. టికెట్లు పొందాలన్నా,ప్రచారం చేసుకోవాలన్నా, ఓట్లు సాధించాలన్నా ప్రతి దానికీ పైసలతోనే పని. పోలింగ్ పూర్తయ్యే చివరి నిమిషం వరకూ చేతి నిండా డబ్బుండాలి. ఇండియన్ ఎలక్షన్స్ ఎందుకింత ఖరీదైనవి గామారాయనేది చర్చకు దారితీస్తోం ది. ఎన్నికల వ్యవస్థను మరింత ఓపెన్ గా మార్చటానికిగవర్నమెంట్ చర్చలు తీసుకుందా? అవి ఫలితాలను ఇస్తున్నాయా? ఓటర్లు ఇంకా ప్రలోభాలకుగురవుతూనే ఉన్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఎన్నికల ఖర్చుకు ఎలక్షన్ కమిషన్ లిమిట్ పెట్టింది. లోక్ సభ క్యాండిడేట్ కు రూ.70లక్షల వరకు, అసెంబ్లీ అభ్యర్థికి రూ.28 లక్షలదాక అనుమతించింది. రాష్ట్రాన్ని బట్టి ఈ పరిమితి మారుతుంది. ఎలక్షన్లలో పోటీ చేసే క్యాండిడేట్లు ఈసీకి ఇచ్చే లెక్కలు చిత్రంగా ఉంటాయి. వాళ్లుఖర్చు చేసే ప్రతి రూ.100ల్లో మూడో వంతు కన్నాతక్కువే లెక్క చూపిస్తున్నారు . ఓవరాల్ గా 50వ వంతు ఖర్చుకే ఆధారాలు చూపుతున్నారు .2019 లోక్‌సభ ఎన్నికల ఖర్చు రూ.50 వేల కోట్లకు చేరనుందని అంచనా. ఈ నంబర్లు అంచనాలే.వాస్తవానికి ఇవి ఇంకా ఎక్కువే. ఎందుకంటే, ఈవ్యయంలో మెజారిటీ భాగం లెక్కల్లోకి రాని క్యాష్ రూపంలో ఉంటుంది. ఈ లావాదేవీలు బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా జరగవు. పార్టీలు అఫీషియల్ గారిపోర్ట్ ఇవ్వటానికి ఛాన్స్ ఉండదు.ఎన్నికలు కాస్ట్లీగా మారటానికి సవాలక్ష కారణాలున్నాయి.
లోక్‌సభ సెగ్మెంట్ల పరిమాణం విస్తరిస్తోంది. ‘గిఫ్టులు’ ఇస్తే తప్ప ఓటేసే ప్రసక్తే లేదంటున్న ‘ఇండిపెండెంట్ ఓటర్లు’ పెరుగుతున్నారు. బరిలో నిలుస్తున్న క్యాండిడేట్ల సంఖ్య పెరుగుతున్నకొద్దీ పోటీ తీవ్రంగా మారుతోంది. అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలు, పొలిటికల్ కన్సల ్టెంట్లు, వాలంటీర్లగ్రూపులు; ఆన్ లైన్, ఆఫ్ లైన్ ప్రచారం వగైరా వన్నీపరిగణనలోకి తీసుకోవాలి. అభ్యర్థులు ఈసీ కిచెప్పాపె ట్టకుండా చేసే ఖర్చుని ఎక్స్‌పెండిచర్ రిపోర్టులో చూపించే వ్యయంతో పోల్చితే ‘నక్కకీనాగలోకానికీ ఉన్నంత తేడా’ ఉంటోంది. ఈసీ ఈతేడాని సాక్ష్యాలతో పట్టుకునే ఛాన్స్ లేదు. క్యాండిడేట్ల వ్యయంపై లిమిట్ పెట్టారు గానీ, పార్టీల ఖర్చు పై పరిమితి లేదు. పార్టీలు ఎంత ఖర్చు పెట్టాయి? ఆడబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అనేది చెబితే సరి పోతుంది. ఈ నిధుల ట్రాన్స్ పరెన్సీ కోసం కేంద్రం అమలుచేస్తున్న ఎలక్టోరల్ బాండ్లు సత్ఫలితాలను ఇవ్వట్లేదు.
మైండ్ బ్లాక్ మనీ
పెద్ద నోట్ల రద్దు టైంలో పీఎం మోడీ చెప్పిన మాటలకు, ఇప్పుడు జరుగుతున్నదానికి పొంతనలేదు. బ్లాక్ మనీ చెలామణికి డీమానిటై జేషన్ఎండ్ కార్డ్ వేస్తుందని ప్రధాని అప్పట్లో సెలవిచ్చారు . లోక్ సభ ఎలక్షన్ నేపథ్యంలో పోలీసు తనిఖీల్లో దొరుకుతున్న లెక్కా పత్రం లేని డబ్బుచూస్తే మైండ్ బ్లాంక్ అవుతోంది. దీనికి కొన్ని ఉదాహరణలు.. తమిళనాడులో రూ.137 కోట్లసీజ్, అరుణాచల్ ప్రదేశ్ సీఎం కాన్వాయ్ లో1.8 కోట్ల జప్తు, దేశం మొత్తం మీద డైలీ రూ.67కోట్ల స్వాధీనం, ఓటర్లను ప్రభావితం చేస్తూ ఎలక్షన్రూల్స్ అతిక్రమిస్తున్నామన్న కొందరులా మేకర్లు,కేసీఆర్ మీటింగ్ కొస్తే డబ్బిస్తానని మాట తప్పినలోకల్ టీఆర్ఎస్ నేతకి వ్యతిరేకంగా ఖమ్మంలో ధర్నా. 2014 ఎన్నికలప్పుడు ఈసీ దేశవ్యాప్తంగా సుమారు రూ.1200 కోట్ల విలువైన వస్తువులను,రూ.300 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది.2019 జనరల్ ఎలక్షన్ నేపథ్యంలో ఏప్రిల్ ఒకటినాటికే రూ.1460 కోట్ల ఖరీదు చేసే తాయిలాలు తనిఖీల్లో దొరికాయి. ఎన్నికలు ముగిసేనాటికి నెలరోజులకు పైగా సమయం ఉండటంతో ఇంకెంతసొమ్ము, గూడ్స్ దొరుకుతాయో చూడాలి.