బిగ్ బాస్ 16 ఫేమ్ అబ్దు రోజిక్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఎదుట హాజరయ్యాడు. ప్రముఖ బర్గర్ కంపెనీ ' బుర్గీర్ ' కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇందుకు గాను ఆ సంస్థ నుండి పెద్ద మొత్తంలో పారితోషికం కూడా అందుకుంటున్నాడు. ఇటీవల వెలుగులోకి వచ్చిన డ్రగ్ మాఫియా డాన్ అలీ అస్గర్ శిరాజి తో అబ్దు రోజిక్ కి సంబంధం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేసేందుకు ఈడీ నోటీసులు పంపినట్లు సమాచారం. ఇదే కేసులో కొన్నాళ్ల కిందట శివ థాక్రే కూడా విచారణకు హాజరయ్యాడు.
ALSO READ :- Ayaan,Arjun: మొన్న అయాన్.. నేడు అర్జున్.. నెక్స్ట్ జనరేషన్ కూడా గట్టిగానే!
ఈమెయిల్ ద్వారా నోటీసులు అందుకున్న అబ్దు మంగళవారం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యాడు. ఈ విచారణలో అలీ అస్గర్ తో సంబంధాలతో పాటు బుర్గీర్ సంస్థకు అబ్దుకి మధ్య లావాదేవీలపై కూడా ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం. డ్రగ్ మాఫియా డాన్ అలీ సర్గర్ కేసు వెలుగులోకి రాగానే అబ్దు హాస్లర్స్ సంస్థతో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న నేపథ్యంలో కూడా ఈడీ విచారణ జరిపిందని సమాచారం.డ్రగ్ అలీ అస్గర్ కి, శివ్ థాక్రే కి, హాస్లర్స్ సంస్థకు మధ్య 46లక్షల రూపాయల లావాదేవీలు జరిగిందని ఈడీ తెలిపింది. హాస్లర్స్ సంస్థతో కాంట్రాక్ట్ ఉన్న కారణం చేతనే అబ్దుని విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.