మనీలాండరింగ్ కేసులో మలయాళ నటి

మనీలాండరింగ్ కేసులో మలయాళ నటి నవ్య నాయర్‌కు ఐఆర్‌ఎస్ అధికారి సచిన్ సావంత్‌తో సంబంధాలున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గుర్తించింది. ఈ కేసులో నవ్య నాయర్‌ను ఈడీ ప్రశ్నించి వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఛార్జిషీట్‌లో భాగమైన నవ్య నాయర్ వాంగ్మూలాన్ని గత వారం అధికారులు ప్రత్యేక ఈడీ కోర్టులో సమర్పించారు.

సీబీఐ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా సచిన్ సావంత్ మనీలాండరింగ్ కేసు దర్యాప్తు సందర్భంగా, సావంత్ నుంచి మొబైల్ డేటా, చాట్‌లు, స్టేట్‌మెంట్‌లను సేకరించడం ద్వారా దర్యాప్తు సంస్థ నాయర్ ప్రమేయాన్ని కనుగొంది. ఐఆర్‌ఎస్‌ అధికారి సచిన్‌ సావంత్‌, నవ్య నాయర్‌ చాలా సన్నిహితంగా మెలిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. నాయర్‌ని కలవడానికి సావంత్ 8-10 సార్లు కొచ్చిన్‌కు వెళ్లినట్లు సమాచారం. అయితే, ED ప్రశ్నించినప్పుడు మాత్రం నవ్య నాయర్.. తనకు సచిన్ తో ఎలాంటి సంబంధం, సన్నిహిత్యం లేదని.. తాము కేవలం స్నేహితులమనే అని చెప్పింది.

ఆ తర్వాత జరిగిన విచారణలో మాత్రం మలయాళ నటి నవ్య నాయర్‌కు సచిన్ సావంత్ నగలతోపాటు కొన్ని బహుమతులు ఇచ్చాడని తేలింది. నాయర్ తన ప్రకటనలో, సచిన్ తనకు స్నేహానికి గుర్తుగా కొన్ని నగలను బహుమతిగా ఇచ్చాడని తెలిపాడు. ప్రత్యేక కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో నవ్య నాయర్‌ వాంగ్మూలాన్ని ఈడీ జత చేసింది. మనీలాండరింగ్ కేసులో నాయర్‌తో పాటు సావంత్‌కు చెందిన మరో మహిళా స్నేహితుడి వాంగ్మూలాలు సైతం నమోదయ్యాయి.

ALSO READ :Layoffs : మొబైల్ కంపెనీలో 700 ఐటీ ఉద్యోగుల తొలగింపు

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జూన్ 27, 2023న మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002కి సంబంధించి కస్టమ్స్ అదనపు కమిషనర్ సచిన్ బాలాసాహెబ్ సావంత్‌ను లక్నోలో అరెస్టు అయ్యారు. సావంత్ గతంలో ED ముంబై జోన్ 2కి డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేశాడు. సచిన్ బాలాసాహెబ్ సావంత్ అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకున్నారని ఆరోపణలు సూచిస్తున్నాయి. PMLA విచారణ సమయంలో, ఏజెన్సీ ఆరోపించినట్టు బినామీ ఆస్తులు, సంస్థలు, అతని ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన అక్రమాలపై దృష్టి సారించింది. ఈ విచారణలో దాదాపు రూ. 1.25 కోట్ల నగదు డిపాజిట్లు సావంత్ కుటుంబ సభ్యుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి జమ అయినట్టు తేలింది.