- వృద్ధుడి నుంచి రూ.9.50 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
బషీర్ బాగ్, వెలుగు : మనీ లాండరింగ్ పేరిట 89 ఏండ్ల వృద్ధుడి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.9.50 లక్షలు కొట్టేశారు. సిటీకి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు ముంబై పోలీసులంటూ వాట్సాప్ కాల్ చేశారు. ముంబైలో అతని పేరుపై కెనరా బ్యాంక్‌లో అకౌంట్ ఉందని, దాని ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు బెదిరించారు. విచారణకు సహకరించకపోతే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు.
అకౌంట్లోని డబ్బులను బదిలీ చేయడానికి సుప్రీంకోర్టు జడ్జి సంతకం చేసినట్లు ఉన్న ఓ ఫేక్ ఆర్డర్ కాపీని బాధితుడికి పంపించారు. అడిగినంత పంపకపోతే అరెస్టు చేస్తామని బెదిరించారు. దీంతో వృద్ధుడు అతని అకౌంట్ లోని మొత్తం రూ.9.55 లక్షలను చీటర్స్ అకౌంట్ కు బదిలీ చేశాడు. మళ్లీ ఇంకొంత డబ్బులు కోసం డిమాండ్ చేయడంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.