- క్యాషియర్‌పై బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు
మధిర, వెలుగు : ఖమ్మం జిల్లా మధిర మండలం సిరిపురంలోని ఏపీజీవీబీ(ఆంధ్రప్రదేశ్గ్రామీణ వికాస్‌బ్యాంక్) బ్రాంచ్‌లో దాదాపు రూ.17 లక్షలు మాయం అయ్యాయి. మధిర రూరల్ఎస్సై ఉతల్రఫీ తెలిపిన వివరాల ప్రకారం.. ఖాతాదారులు జమచేసిన రూ.16,97,382 లెక్క తేలకపోవడంతో మేనేజర్ రవి.. క్యాషియర్ సురేశ్‌బాబుపై మధిర రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బ్యాంకులోని డబ్బును సురేశ్‌బాబు తన సొంత అవసరాలకు వాడుకున్నాడని పేర్కొన్నాడు. క్యాషియర్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.