మీరు కోటీశ్వరులు కావాలంటే ఈ పొదుపు మంత్రం పాటించండి.. వాళ్లు ఇలాగే ధనవంతులు అయ్యారు.

మీరు కోటీశ్వరులు కావాలంటే ఈ పొదుపు మంత్రం పాటించండి.. వాళ్లు ఇలాగే ధనవంతులు అయ్యారు.

ప్రపంచంలో చాలామంది మిలియనీర్స్, మల్టీ మిలియనీర్స్ ఉన్నారు. వాళ్లలో అందరూ పుట్టుకతో కోటీశ్వరులు కారు. చాలామంది జీరోతో మొదలైన వాళ్లే. అందరూ చిన్న ఉద్యోగంలోనో, చిన్న బిజినెస్ తోనే కెరీర్ స్టార్ట్ చేస్తారు. మరి వాళ్లెందుకు అంత సక్సెస్ అయ్యారు. మిగతా వాళ్లు ఎందుకు అవ్వలేకపోతున్నారు. ఇదే డౌట్ థామస్ సి కోర్లేకు వచ్చింది. ఐదేళ్లు శ్రమ పడి ఒక స్టడీ చేశాడు. 177 మంది మిలియనీర్ ని కలిసి ఇంటర్వ్యూ చేశాడు. చివరికి అతను తేల్చింది ఏంటంటే... మిలియనీర్స్ అందరూ ఒకే సేవింగ్ ఫార్ములా ఫాలో అవుతున్నారట

థామస్​  సి కొర్లె అమెరికాకు చెందిన  సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. ఫైనాన్షియల్ విషయాలపై రీసెర్చ్ చేస్తుంటాడు. వందల మంది మిలియనీర్స్ ని కలిశాడు. మిలియనీర్స్, ఎకనమిస్టులు రాసిన ఎన్నో పుస్తకాలు చదివాడు. ఆ రీసెర్చ్​ లో భాగంగా ఐదేళ్లు కష్టపడి  ఒక స్టడీ చేసాడు.  ఆ స్టడీ కోసం 233 మంది మిలియనీర్స్​ ని కలిశాడు. ఆ 233 మందిలో 177 మంది జీరోతో స్టార్ట్ అయ్యి  మిలియనీర్స్ గా ఎదిగిన వాళ్లు .  అయితే  177 మందికి ఒకే రకమైన సేవింగ్ ప్లాన్స్ ఒకే రక్తమైన మనీ హ్యాబిట్స్ ఉన్నట్లు థామస్​తన స్టడీలో వెల్లడించాడు. ఆ విషయాలేంటంటే..

సక్సెస్ సీక్రెట్ ఇదే..

సొంతగా ఎదిగిన మిలియనీర్స్ అందరూ. వయసు యాభై దాటినా తర్వాతే మిలియనీర్స్ అయ్యారు. అయితే ఈ యాభై ఏళ్లు ఎంతో ప్లానింగ్ తో సేవింగ్స్ చేసేవాళ్లట. మిలియనీర్స్ అందరూ కెరీర్ స్టార్టింగ్​ లో పది నుంచి ఇరవై శాతం ఇన్​కం సేవ్ చేసేవాళ్లట. ఇప్పుడు ప్రపంచంలో యావరేజ్ సేవింగ్ శాతం ఎనిమిది. అంటే వస్తున్న జీతం లేదా ఆదాయంలో మాత్రమే 8 శాతం మాత్రమే ఆదా చేస్తున్నారు. కానీ మిలియనీర్స్ అందరూ సుమారు ఇరవై శాతం చేయాలని టార్గెట్ పెట్టుకునే వాళ్లట.

ALSO READ | రతన్ టాటా ఆస్తులు ఎన్ని వేల కోట్లు..? : ఇప్పుడు ఆ ఆస్తులు ఎవరి సొంతం..?

ముఖ్యంగా మిలియనీర్స్ అందరూ వాళ్ల ఆదాయాన్ని బకెట్ సిస్టం' లో ఆదా చేసేవాళ్లట. బకెట్ సిస్టం అంటే ఒక బకెట్ నిండిన తర్వాత మరో బకెట్ నింపినట్లుగా డబ్బుని కూడా ప్రియారిటీస్ ప్రకారం సేవింగ్ చేస్తూ పోవడం.. మిలియనీర్స్ అందరూ ఆదాయాన్ని నాలుగు విధాలుగా సేవ చేస్తారట. రిటైర్మెంట్  సేవింగ్స్​, స్పెసిఫిక్​ ఎక్స్​పెన్సస్​, ఎమర్జన్సీ ఎక్స్​పెన్సస్​,  సైక్లికల్​ ఎక్స్​పెన్సస్​. 

రిటైర్మెంట్ సేవింగ్స్  :  రిటైర్ అయ్యిన తర్వాత అవసరాల కోసం ఇప్పటి నుంచే కొంత డబ్బుని సేవ్ చేయడం అంటే ఇల్లు, కారు లాంటి వాటికోసం.
 స్పెసిఫిక్​ ఎక్స్​పెన్సస్ :   లైఫ్ లో ఇష్టమైన, అవసరమైన వాటికోసం ప్రత్యేకంగా కొంత డబ్బుని దాచడం. ఉదాహరణకు ట్రావెలింగ్, షాపింగ్ లాంటివి.
ఎమర్జన్పీ ఎక్స్​పెన్సస్ :  అనుకోకుండా వచ్చే అవసరాల కోసం ముందుగానే కొంత డబ్బుని సేవ్ చేయడం. ఉదాహరణకు హెల్త్ ప్రాబ్లమ్స్ లాంటివి. 
సైక్లికల్​ ఎక్స్​పెన్సస్  : . సంవత్సరానికి ఒకసారి వచ్చే ఖర్చులు కోసం దాచిపెట్టడం..బర్త్ డేలు, యానివర్సరీల లాంటివి..

 దాదాపు మిలియనీర్స్ అందరూ ఇదే ఫార్ములాను ఫాలో అవుతారట. ఇంకా ఇవే కాకుండా సాధారణ వ్యక్తులు పాటించాల్సిన మనీ హ్యాబిట్స్​, సేవింగ్ ప్లాన్​ తోనే ఎవరైనా ఫైనాన్సియల్ గా సక్సెస్ అవుతారంటున్నారు. అవేంటంటే..

  • ప్లానింగ్ ఇలా..సేవింగ్స్ చేయాలనుకుంటే దానికి టైంతో పనిలేదు.  వెంటనే మొదలు పెట్టాలి. 'టైం  ఈజ్ మనీ" అన్న ఫార్ములాని గుర్తు పెట్టుకోవాలి. అలా వెంటనే మొదలుపెట్టినప్పుడే అది అలవాటుగా మారుతుంది. 
  •  ఈ రోజుల్లో వంద నోటు మారిస్తే చేతిలో రూపాయి కూడా చిల్లర మిగలదు చాలా మందికి. దీనికి కారణం ఖర్చుపై కంట్రోల్​ లేకపోవడం.  పొదుపు అంటే ఖర్చుపై అదుపు.  అంటే ఖర్చులను అదుపులో ఉంచుకున్నప్పుడే అదుపు సాధ్యం అంటున్నాడు థామస్​.  కనీసం సంపాదనలో 20 నుంచి 30 శాతం ఆదా చేసుకుంటే ఎలాంటి ఫైనాన్షియల్​ ఇబ్బంది ఉండదని..వయస్సుతో పాటే ఆస్తి కూడా పెరుగుతుందని చెప్తున్నాడు. 
  •   పొదుపు ఎలా చేయాలి అన్న విషయంలో. చాలామందికి డౌట్స్ ఉంటాయి. అయితే వాటికోసం ఎన్నో మార్గాలున్నాయి. వాటన్నింటి మ్యూచువల్ ఫండ్స్, బ్యాంకుల్లో
  • రికరింగ్ డిపాజిట్స్ చేయడం ఇప్పుడున్న బెస్ట్ ఆప్షన్స్ అని థామస్​చెప్తున్నాడు. ఇన్వెస్ట్మెంస్ట్​ మెంట్ సేవింగ్ ప్లాన్స్ వల్ల ప్యూచర్లో లాభముంటుందని, డబ్బును ఒకచోట స్థిరంగా ఉంచితే ఏలాంటి ప్రయోజనం ఉండదని చెప్తున్నాడు. 
  • క్రెడిటీ కార్లు ఉంటే చేతిలో  డబ్బు ఉన్నట్లే అనుకుంటారు చాలామంది . అది కూడా తప్పే.  మనకు వచ్చే ఆదాయాన్ని బట్టి కాకుండా  క్రెడిట్ కార్డు లిమిట్ ని బట్టి ఖర్చు  చేస్తే ఫ్యూచర్ లో వడ్డీల తప్పులు తప్పవని నిపుణులు చెప్పున్నారు.
  •  అలాగే షాపింగ్ కూడా.. ఈ రోజుల్లో అందరూ ఎక్కువగా ఖర్చు పెట్టేది షాపింగ్​కే ఆఫర్ల పేరుతో డిస్కౌంట్ సేల్స్ పెడితే అందరూ అట్రాక్ట్ అయ్యి షాపింగ్ చేస్తుంటారు. ఇక్కడే మిలియనీర్స్ జాగ్రత్తగా ఉంటారు. మిలియనీర్స్ షాపింగ్ కోసం ఎక్కువగా ఖర్చుపెట్టరు. మినిమలిస్టిక్ పద్ధతిలో అవసరానికి తగ్గ వస్తువులు వాడుతూ. ఖర్చులను కంట్రోల్ చేస్తారు.
  • పొదువుని పెంచాలంటే ఒక సిస్టమేటిక్ బడ్జెట్ వేసుకోవడం చాలా అవసరం. ఆదాయాన్ని, ఖర్చులను బట్టి ఫ్యూచర్ ఫైనాన్షియల్ గోల్ ఏంటో నిర్ణయించుకుని, ఒక సిప్లమాటిక్ బడ్జెట్ వేసుకోవాలి. పొదుపు చేసే ప్రతి రూపాయి ఎక్స్ట్రా కం కింద లెక్క వేసుకోవాలి.
  • ఫైనాన్సియల్​ స్టేబుల్​ గా ఉండాలంటే కెరీర్​ లో వస్తున్న మార్పులు గమనించాలి. కొన్నిసార్లు శాలరీ లో హైక్​ రావచ్చు. మరికొన్ని సార్లు ఆదాయం తగ్గిపోవచ్చు. వాటికి తగ్గట్టు ప్లాన్​ ఉండాలి. ఆదాయం పెరిగితే మరింత పొదుపు చేయాలి.  ఒకవేళ తగ్గితే ఖర్చులు తగ్గించుకోవాలి తప్ప పొదుపులో తేడా రాకుండా చూసుకోవాలి.
  • మంచి క్రెడిట్ స్కోర్​ మెయింటెయిన్​ చేయడం చాలా ఇంపార్టెంటే..అప్పులు, ఇన్​స్టాల్​ మెంట్లు, బిల్లులను టైంకి కడితే మంచి స్కోర్  వస్తుంది. మంచి స్కోర్​ ఉంటే అవసరానికి క్రెడిట్ లేదా లోన్స్ లాంటివి పొందొచ్చు
  • సేవింగ్ ఎప్పుడైనా లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకుని చేయాలి. సేవింగ్స్ ఓ పదేళ్ల పాటు చేస్తే గానీ  అనుకున్న రిజల్ట్​ కనపడదని థామస్ తన స్టడీలో పేర్కొన్నాడు.
  • అలాగే పిల్లలకు కూడా చిన్నప్పటి నుండే పొదుపు అలవాటు చేయాలి. చిన్నప్పటి నుంచి ఫైనాన్షియల్ మ్యాటర్స్ తెలిసేలా పెంచితే ఆర్థికంగా ఆరోగ్యకరమైన జనరేషన్​ తయారవుతుంది. 
  • అవసరానికి అప్పు చేయడం అలవాటు.చాలామందికి. కానీ ఇప్పుడుచేసే అప్పు ఫ్యూచర్లో తిప్పులు తెచ్చి పెడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వడ్డీలకు అస్సలు అప్పులు చేయకూడదు. అప్పుకు ఎంత దూరంగా ఉంటే ఫైనాన్షియల్ అంత సేఫ్ గా ఉన్నట్టు లెక్క..

-–వెలుగు, లైఫ్​–