ఎన్నికల కోడ్ ఉన్నప్పుడే.. ఫార్ములా ఈ రేసింగ్ అగ్రిమెంట్.. లండన్ కు డబ్బు తరలింపు

ఎన్నికల కోడ్ ఉన్నప్పుడే..  ఫార్ములా ఈ రేసింగ్ అగ్రిమెంట్.. లండన్ కు డబ్బు తరలింపు

ఫార్ములా ఈ రేస్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి..ఈ వ్యవహారంలో భారీగా డబ్బులు లండన్ కు తరలించినట్లు తెలుస్తోంది. ఈ రేసు అగ్రిమెంట్​లో భాగంగా 2023 ఫిబ్రవరిలో 9 సీజన్  ముగియడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 10న సీజన్‌‌‌‌ 10 నిర్వహించాల్సి ఉంది.  ఈ క్రమంలో వివిధ కారణాలతో సీజన్‌‌‌‌ 10 రద్దు చేసుకుంటున్నట్లు ఫార్ములా ఈ ఆపరేషన్స్‌‌‌‌ సంస్థ 2023 అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 27న నాటి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. దీంతో ఫార్ములా ఈ ఆపరేషన్స్‌‌‌‌, ఎంఏయూడీ మధ్య 2023 అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 30న  కొత్త అగ్రిమెంట్‌‌‌‌ జరిగింది.

ఈవెంట్‌‌‌‌ నిర్వహణ కోసం  రూ.90 కోట్లు  ఎంఏయూడీ ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. ఈ క్రమంలోనే అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 10న అసెంబ్లీ ఎన్నికల కోడ్‌‌‌‌  అమల్లోకి వచ్చి, డిసెంబర్‌‌‌‌ 4 వరకు  కొనసాగింది. అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 3న ఫస్ట్​ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌మెంట్‌‌‌‌ కింద రూ.22 కోట్ల 69 లక్షల 63 వేల 125‌‌‌‌ , అక్టోబర్ 11న రెండో ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌మెంట్‌‌‌‌ కింద రూ. 23 కోట్ల లక్షా 97 వేల 500 రిలీజ్​చేయగా.. హిమాయత్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లోని ఇండియన్‌‌‌‌ ఓవర్‌‌‌‌‌‌‌‌సిస్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ నుంచి యూకేలోని ఫార్ములా ఈ ఆపరేషన్స్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ అకౌంట్​కు అక్టోబర్​11న ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ అయ్యాయి.

Also Read:-ఫార్ములా ఈ రేసింగ్ కేసులో 600 కోట్ల అగ్రిమెంట్.. కేటీఆర్ ఆదేశాల మేరకే..

ఎలక్షన్‌‌‌‌ కోడ్‌‌‌‌ అమలులో ఉండగానే రూ. 45.71 కోట్లను ఫార్ములా ఈ ఆపరేషన్స్‌‌‌‌కు హెచ్​ఎండీఏ అకౌంట్​ నుంచి యూకేకు డబ్బులు బదిలీ అయ్యాయి. ఆర్బీఐకి సమాచారం లేకుండా విదేశాలకు ఫండ్స్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ కావడం వల్ల ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌కు  హెచ్‌‌‌‌ఎండీఏ  ఫైన్​రూపంలో రూ. 8 కోట్ల 6 లక్షల 75 వేల 404 చెల్లించాల్సి వచ్చింది. దీంతోపాటు వివిధ ఫీజుల రూపంలో ఫెడరేషన్​ ఇంటర్నేషనల్​ ఆటోమొబైల్(ఎఫ్​ఐఏ),  ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా(ఎఫ్​ఎమ్​ఐ)కి  రూ. కోటి 10 లక్షల 51 వేల 14 ను హెచ్‌‌‌‌ఎండీఏ చెల్లించింది.

ఇలా సీజన్ 10​ కోసం  మొత్తం రూ. 54 కోట్ల 88లక్షల 87 వేల 43ను హెచ్‌‌‌‌ఎండీఏ చెల్లింపులు చేసింది.  ఆర్బీఐకి సమాచారం ఇవ్వకుండా, అదీ ఎన్నికల కోడ్​ ఉన్న టైమ్​లో యూకేకు మనీ ట్రాన్స్​ఫర్​ కావడం వెనుక స్కామ్​ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. మనీలాండరింగ్​ కావడంతో ఈడీ కూడా రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది.