నో మనీ.. ఫుల్ హ్యాపీ.. లైఫ్ ఎంజాయి.. ఇది సాధ్యమేనా.. .

ఈ రోజుల్లో ప్రతీ అంశం డబ్బుతో ముడిపడి ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే అది లేకుండా జీవించడం అసాధ్యం. కానీ యూకేకు చెందిన మార్క్ బాయిల్ అనే వ్యక్తికి మాత్రం ఇది సాధ్యమైంది. మనీ లేకుండా కూడా సంతోషంగా జీవించవచ్చునని నిరూపించాడు.  అదెలా అనకుంటున్నారా.. అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి. .  .

 మార్క్ బాయిల్  2008 నుంచే అతను డబ్బు లేని జీవనశైలిని గడుపుతున్నాడు.  కనీసం టెక్నాలజీని కూడా వాడుకోవడంలేదు...  చాలా సింపుల్‌గా ప్రకృతి ద్వారా అందే పండ్లు, కాయగూరలను మాత్రమే తింటూ సహజ జీవనం కొనసాగిస్తున్నాడు.   వాస్తవానికి మార్క్ అంతకు ముందు బిజినెస్ అండ్ ఎకనామిక్స్‌ డిగ్రీలో కళాశాల పట్టా పొందాడు. ఆ తర్వాత యూకే బ్రిస్టల్‌లోని ఒక ఆర్గానిక్ ఫుడ్ కంపెనీలో మంచి శాలరీ తో జాబ్ కూడా చేశాడు.  కానీ ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా  ఎటువంటి హంగూ ఆర్బాటాలు, డబ్బు లేకుండా చాలా సింపుల్‌గా  జీవనం గడుపుతున్నాడు.

2007 లో మార్క్ బాయిల్ కొత్త జీవితాన్ని ప్రారంభించాడు.  అప్పట్లో ఒకరోజు రాత్రి అతని హౌస్‌బోట్‌లో గ్లాస్ ఆఫ్ మెర్లాట్ అనే ఒక ఫిలాసపర్‌తో ఏర్పడిన పరిచయం అతన్ని పూర్తిగా మార్చి వేసింది.  ఫ్రెండ్లీ సెషన్‌లో వారు ప్రపంచ సమస్యల గురించి చర్చించారు. చాలా సమస్యలకు మూలం డబ్బేనని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మార్క్ బాయిల్‌కు Be the change you want to see in the world అనే గాంధీజీ కొటేషన్ గుర్తుకొచ్చింది. ఓ వైపు ఫిలాసఫర్‌ ఆలోచన, మరోవైపు గాంధీజీ కొటేషన్ అతన్ని చాలా ప్రభావితం చేశాయి. అప్పటి నుంచే డబ్బులేకుండా జీవించాలని నిర్ణయించుకున్నాడు.

అప్పుడు  మార్క్ తన ఖరీదైన హౌస్‌బోట్‌ను విక్రయించి, పాత కారవాన్‌లోకి మారాడు. ఈ కారవాన్ కూడా డబ్బుతో కొనలేదు. అతని మార్పును చూసి ఎవరో విరాళంగా ఇచ్చారట. ఇక అప్పటి నుంచి మనీ‌లెస్ లైఫ్‌ను ఎంతో నిబద్ధతతో కొనసాగిస్తున్నాడు. ఉదయం పూట కప్పు కాఫీతో మొదలయ్యే అతని దినచర్య, ప్రకృతి నుంచి ఉచితంగా పొందగలిగే ఆహారాలతో కొనసాగించాల్సి వచ్చినందుకు ప్రారంభంలో కొంత ఇబ్బంది పడ్డాడు. తర్వాత అలవాటు పడ్డాడు. డబ్బు లేకుండా జీవిస్తున్న మార్క్ బాయిల్ 2010లో ది మనీలెస్ మ్యాన్‌ అనే పుస్తకాన్ని కూడా రాశాడు. ఇందులో అతను తనలో వచ్చిన పరివర్తన, ఎదుర్కొన్న ఇబ్బందులతోపాటు, కొత్తగా కనుగొన్న ఆచరణాత్మక పరిష్కారాల గురించి, అలాగే తత్వశాస్త్రం గురించి వివరంగా చెప్పాడు.

మార్క్ ప్రకృతి సహజ జీవనం ప్రారంభించినప్పటి నుంచి తాను ఎలాంటి  అనారోగ్యం బారిన పడలేదని, తనకు ఆరోగ్య రక్షణ అవసరం లేదని బాయిల్‌ తెలిపాడు. బాయిల్‌ జీవితాన్ని చూసిన చాలామంది అతనికి స్నేహితులుగా మారారు. తాను 2017లో టెక్నాలజీ జోలికి వెళ్లడాన్ని పూర్తిగా వదులుకున్నానని, సాంకేతికతతో ముడిపడిన  పాత జీవితం కాకుండా, సహజసిద్దంగా ప్రకృతితో గడిపే భావి జీవితం గురించి నిరంతరం ఆలోచిస్తుంటానని బాయిల్‌ తెలిపాడు. 

ALSO READ : లెజండరీ లతా మంగేష్కర్ చివరి కోరికను నెరవేర్చిన బంధువులు.. అది ఏంటంటే..