స్కానింగ్ సెంటర్లపై నిఘా పెంచాలి

స్కానింగ్  సెంటర్లపై నిఘా పెంచాలి

వనపర్తి, వెలుగు : జిల్లాలోని ప్రైవేట్  హాస్పిటల్స్, స్కానింగ్  సెంటర్లపై నిఘా పెంచాలని కలెక్టర్  తేజస్  నందలాల్ పవార్  వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్​లో బేటీ బచావో బేటీ పడావో, పీసీపీఎన్డీటీ యాక్ట్ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ ప్రైవేట్  హాస్పిటల్స్, స్కానింగ్  సెంటర్లలో తనిఖీలు నిర్వహించాలన్నారు.

లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేసే వారితో పాటు ప్రోత్సహించే వారిపై కఠిన చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం లేని ఆసుపత్రులు, స్కానింగ్  సెంటర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. అడిషనల్  కలెక్టర్  సంచిత్  గంగ్వార్, డీఎంహెచ్ వో డాక్టర్  జయచంద్ర మోహన్, డిప్యూటీ డీఎంహెచ్ వో  శ్రీనివాసులు పాల్గొన్నారు.

సొసైటీలను బలోపేతం చేయాలి

వనపర్తి :  జిల్లాలోని కో ఆపరేటివ్ సొసైటీలను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కలెక్టర్  తేజస్  నందలాల్ పవార్  సూచించారు. కలెక్టరేట్​లో సొసైటీలపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ ‘సహకార్  సే సమృద్ధి’ నినాదాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి స్వయం సమృద్ధి సాధించేలా చూడాలన్నారు. వ్యవసాయ, పాడి, మత్స్య, సహకార సంఘాల ద్వారా స్వయం సమృద్ధి సాధించేలా చర్యలు చేపట్టాలన్నారు. డీసీవో రఘునాథరావు, డీఏవో సుధాకర్ రెడ్డి, హార్టికల్చర్  ఆఫీసర్​ సురేశ్, ఫిషరీస్​ ఆఫీసర్​ రెహమాన్, జడ్పీ సీఈవో రామ మహేశ్వర్ రెడ్డి, డీఆర్డీవో  నర్సింహులు, డీపీవో సురేశ్​ పాల్గొన్నారు.