భగీరథ ట్యాంకులో కోతి డెడ్​బాడీ

భగీరథ ట్యాంకులో కోతి డెడ్​బాడీ
  • నిర్మల్​ జిల్లా కుభీర్​ మండలం నిగ్వ వాటర్​ ట్యాంక్​లో ప్రత్యక్షం
  • గతంలో డోడర్నా తండాలోనూ వ్యక్తి మృతదేహం
  • అధికారుల తీరుతో ఆందోళనలో గ్రామస్తులు

కుభీర్, వెలుగు : మిషన్  భగీరథ పథకంపై అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లో మిషన్  భగీరథ నీళ్లు తాగడానికి జనాలు భయపడుతున్నారు. నిర్మల్​ జిల్లా కుభీర్​ మండలం నిగ్వ గ్రామంలో మిషన్  భగీరథ నీళ్లు కుళ్లిన వాసన రావడంతో గ్రామస్తులు వాటర్  ట్యాంక్​ను పరిశీలించగా కోతి కళేబరం కనిపించింది. దీంతో అధికారులకు సమాచారం అందించారు. సిబ్బంది వచ్చి ట్యాంక్ లో నీళ్లు ఖాళీ చేసి బ్లీచింగ్  పౌడర్ తో క్లీన్  చేశారు. 

ఇదిలాఉంటే గత ఏడాది డొడర్నా తండాలోని మిషన్​ భగీరథ ట్యాంక్​లో ఓ వ్యక్తి డెడ్ బాడీ లభ్యమైంది. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ట్యాంకులో ఈత కొడుతూ చనిపోయాడు. ఇలాంటి ఘటనలు పునరావతం అవుతున్నా సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిషన్  భగీరథ నీళ్లు వాడడానికి ప్రజలు భయపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి స్వచ్ఛమైన నీటిని సప్లై చేయాలని కోరుతున్నారు.