
కోతులు చేసే హంగామా అంతాఇంతా కాదు అనే విషయం అందరికీ తెలిసిందే. కోతులు అద్దంలో ఫేస్ చూసుకోవడం.. ఇంట్లోని వస్తువులు ఎత్తుకెళ్లడం.. ఇలాంటివి కామన్. అయితే కోతులు చేసే వింత చేష్టలు ఒక్కోసారి నవ్వు తెప్పిస్తే.. ఒక్కోసారి చిరాకు తెప్పిస్తాయి. అయితే ఇప్పుడు.. ఓ కోతి చేసిన వింత చేష్టకు ఓ వ్యక్తి చాలా ఇబ్బంది పడ్డాడు. స్మార్ట్ ఫోన్ ఎత్తుకెళ్లిన కోతి ఆ వ్యక్తిని ముప్పు తిప్పలు పెట్టింది.
జగిత్యాల జిల్లాలో గొల్లపల్లి మండలం శ్రీ రాముల పల్లె గ్రామానికి చెందిన ఓ భక్తుడు కొండగట్టులో దేవాలయానికి వెళ్లాడు. ఒక్కసారి గా అతడి చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లాక్కెళ్లిన కోతి చెట్టు ఎక్కి కూర్చుంది. సుమారు అరగంట పాటు రావి చెట్టు పై ఫోన్ ఉంచుకుని దిగలేదు. తర్వాత చెట్టు పై నుంచి ఒక్కసారిగా ఫోన్ వదిలిపెట్టడంతో ఓ యువతి తలకు గాయం అయింది.