మానకొండూరు, వెలుగు : మానకొండూరు వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటుచేసిన కొనుగోలు సెంటర్‌లో కోతుల బెడదతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వందల సంఖ్యలో తరలివస్తూ కోతులు.. వడ్లను చిందరవందర చేస్తున్నాయి. మరోవైపు కొనుగోలు కేంద్రం ప్రారంభించి 10 రోజులైనా ఇప్పటివరకు కొనుగోళ్లు చేపట్టలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సెంటర్‌లో సౌకర్యాల లేమితో రైతులు అవస్థలు పడుతున్నారు. వర్షం వస్తే కప్పేందుకు టార్పాలిన్లు కూడా లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు సెంటర్‌లో కనీసం సెక్యూరిటీ లేక తన వడ్లను దొంగిలించినట్లు ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.