మహిళపై కోతుల దాడి

మహిళపై కోతుల దాడి

అమ్రాబాద్, వెలుగు : నాగర్​ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రానికి ఆదివారం ఉదయం సరుకుల కోసం వచ్చిన ఓ మహిళపై కోతులు దాడి చేశాయి.  మండలంలోని చింతలోనిపల్లి గ్రామానికి చెందిన శాంతమ్మ నిత్యావసర సరుకుల కొనేందుకు మండల కేంద్రానికి వచ్చింది. మార్కెట్ లో ఒక్కసారిగా ఆమెపై కోతుల గుంపు వచ్చి దాడి చేయడంతో చేతికి గాయమైంది. గమనించిన స్థానికులు కోతులను చెదరగొట్టడంతో శాంతమ్మ ప్రమాదం నుంచి బయటపడింది. శాంతమ్మను స్థానిక సివిల్ హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​ చేయించారు.  మండలంలో కోతుల బెడద ఎక్కువైందని, వెంటనే ఆఫీసర్లు కోతుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.  

కుక్కల దాడిలో బాలికకు తీవ్ర గాయాలు

నర్సాపూర్, వెలుగు : మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ 6వ వార్డులో ఏడేండ్ల బాలికపై ఆదివారం కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. పట్టణానికి చెందిన ముఖసిర్ ఆలీ కూతురు నైల కిరాణా షాపునకు నడుచుకుంటూ వెళ్తుండగా కుక్కలు దాడి చేశాయి. బాలిక కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు పరిగెత్తుకు రావడంతో  కుక్కలు పారిపోయాయి. తీవ్రంగా గాయపడ్డ నైలాను ట్రీట్​మెంట్​ కోసం హైదరాబాద్​లోని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. పట్టణంలో కుక్కలు, కోతులు మనుషులపై దాడి చేసి గాయపరుస్తున్నాయని ఆఫీసర్లు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.