కోతుల మధ్య ఆప్యాయత..మనుషులను మించి..

కోతుల మధ్య ఆప్యాయత..మనుషులను మించి..

జంతువుల మధ్య ఉండే ప్రేమకు వెలకట్టలేం. మనలా వాటికి ఆస్తులు, అంతస్థులు వంటి తేడాలు ఉండవు. ఎదుట ప్రేమించే నేస్తం ఉంటే చాలు మనలాగే అవి కూడా అల్లుకపోతాయి, హత్తుకపోతాయి. తాజాగా జరిగిన ఘటనే దానికి నిదర్శనం. ఓ కోతి కుటుంబం చాలా రోజుల తర్వాత కలిసింది. అవి ఎదురుపడగానే ఒకదాని వీపు మీద ఉన్న పిల్లను తీసుకుని హత్తుకుంది మరో కోతి. ఆ తర్వాత రెండూ ఒకదానికొకటి కౌగలించుకుని సంతోషాన్ని వ్యక్తం చేశాయి.

ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నంద షేర్ చేసిన ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంది. కరోనా కల్లోలం తర్వాత తొలిసారి కలిసిన కుటుంబం అంటూ క్యాప్షన్ ఇచ్చారు సుశాంత నంద. దీన్ని చూసిన నెటిజన్లు కోతులు కూడా అచ్చం మనుషుల్లాగే ప్రవర్తిస్తున్నాయని కామెంట్లు చేస్తున్నారు. 

మరిన్ని వార్తల కోసం

అవినీతి ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ నంబర్ వన్

సోలో వెడ్డింగ్కు సిద్ధమైన గుజరాత్ యువతి