ఎవరైనా వచ్చి కాపాడండి: కోతుల వీరంగం 12 మందికి తీవ్ర గాయాలు

ఎవరైనా వచ్చి కాపాడండి: కోతుల వీరంగం 12 మందికి తీవ్ర గాయాలు

కేంద్రపారా: కోతుల దాడిలో 12 మందికి గాయాలైన సంఘటన మంగళవారం ఒడిశాలో జరిగింది.  ఒడిశాలోని కేంద్రపారా జిల్లా, బాదమంగరాజ్‌ పూర్‌ గ్రామంలోకి ప్రవేశించిన కోతుల మంద పలువురిపై విరుచుకుపడ్డాయి.  ఈ దాడిలో 12 మందికి పైగా గాయపడగా.. వీరిలో ఇద్దరు బాలురున్నారు. కోతులు పంటపొలాలను కూడా ధ్వంసం చేశాయి. గ్రామాల్లోకి వచ్చి జనాలను భయబ్రాంతులకు గురిచేస్తోన్న కోతులను అడవిలోకి పంపించాలని అటవీ శాఖాధికారులను కోరినట్లు స్థానిక అధికారులు తెలిపారు.

కోతుల నుంచి కాపాడుకోలేక మేము నిస్సహాయ స్థితిలో ఉన్నామని.. అధికారులు, ఫారెస్ట్‌ సిబ్బంది తమ ఫిర్యాదులను పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు గ్రామస్థులు. ఇటీవలే పక్క గ్రామంలో కోతుల దాడిలో ఓ వ్యక్తి మరణించానా అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైన ఫారెస్ట్ అధికారులు పట్టించుకుని కోతుల నుంచి తమ ప్రాణాలను కాపాడాలని కోరారు.  కోతులు మందగా వస్తూ పెద్ద అరుపులతో వీరంగం సృష్టిస్తున్నాయని ఎవరైనా వచ్చి తమ ప్రాణాలను కాపాడండి అంటూ కన్నీరుగా విలపిస్తున్నారు గ్రామస్థులు.