అసెంబ్లీ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి సంతాపం

అసెంబ్లీ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి సంతాపం

తెలంగాణ రాష్ట్రంలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమైయ్యాయి. జూలై 23న ఉదయం11 గంటలకు అసెంబ్లీ సెషన్స్ మొదలైయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. దివంగత నాయకురాలు కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే లాస్యా నందితా మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితకు సభలోని సభ్యులందరూ సంతాపం ప్రకటించారు.

పలువురు మంత్రులు, ప్రతిపక్ష నేతలు దివంగత నేత, కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న కుటుంబాన్ని గుర్తుచేసుకున్నారు. ఆమె తండ్రి దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న చనిపోయిన ఏడాదిలోపే లాస్య కూడాచనిపోవడం చాలా బాధాకరం అన్ని విచారం వ్యక్తం చేశారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను రేపటికి వాయిదా వేయనున్నారు. ఆ తర్వాత స్పీకర్  అధ్యక్షతన ఆయన చాంబర్లో బీఏసీ మీటింగ్ నిర్వహిస్తారు. ఎన్ని రోజులు అసెంబ్లీ నడపాలి ?  ఏయే అంశాలపై చర్చించాలనే దానిపై బీఏసీ మీటింగ్ లో ఎజెండాను ఖరారు చేస్తారు.