వర్షాకాలం.. వ్యాధుల కాలం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే...

వర్షాకాలం.. వ్యాధుల కాలం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే...

వర్షాకాలం అంటే చల్లగా హాయిగా ఉంటుందని భావిస్తాం కానీ ఇది వ్యాధులు ముసురుకునే కాలం. అంతేగాదు మిగతా కాలాలతో పోలిస్తే వర్షాకాలంలో వైరస్‌లు, బ్యాక్టీరియా, ఇతర ఇన్‌ఫెక్షన్‌లకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీంతో జలబు, దగ్గు, గొంతులో కఫం, వైరల్‌ ఫీవర్‌ వంటి వ్యాధుల బారిన పడతారు... అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే  సీజనల్​ వ్యాధుల నుంచి  రక్షించుకోవచ్చంటున్నారు వైద్య నిపుణలు.. ఇప్పుడు ఆ వివరాలు గురించి తెలుసుకుందాం. . .

వర్షాకాలం వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తుంటాయి. జాగ్రత్తలు పాటించకపొతే పరిస్థితి తీవ్రంగా మారుతుంది. అందుకే రుతుపవనాలు మారిన వెంటనే కొన్ని విషయాలపై జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.  వర్షాకాలం అంటేనే.. సీజనల్ వ్యాధుల కాలం. వేసవి తర్వాత వాతావరణంలో జరిగే మార్పులు, ఎడతెరపి లేని వర్షాలు, వాటివల్ల నిల్వ ఉండే నీటిలో దోమలు ఆవాసాలను ఏర్పరచుకోవడం, రోడ్లపై మురిగిన నీరు ఉండటం.. ఇలా రకరకాల కారణాల వల్ల సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా చిన్నారులు వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. కనుక వర్షాకాలంలో తల్లిదండ్రులు ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.

ALSO READ | Health Alert : వానాకాలంలో పిల్లల ఆరోగ్యం భద్రం.. ఆ జాగ్రత్తలు తప్పనిసరి

వర్షాల వల్ల కలుషిత నీటికుంటలో, కాలువల్లో, ఇంటి పరిసరాల్లో నీరు చేరడం వల్ల నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన ప్రకారం 80 శాతం  వ్యాధులు నీటి ద్వారానే వ్యాపిస్తాయి. ఇలా నీటి ద్వారా వ్యాపించే వ్యాధులకు వాటర్ బర్న్ వ్యాధులు అంటారు. నిల్వ ఉన్న నీరు దోమలకు, బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలకు సంతానోత్పత్తి ప్రదేశం తయారవుతుంది. ఇవి వేగంగా పెరిగి వ్యాధులకు కారణమవుతాయి. వర్షాకాలంలో కలరా, టైఫాయిడ్ వంటి అనేక వ్యాధుల వ్యాప్తి పెరుగుతుంది. అంతేకాకుండాఈ సీజన్‌లో స్కిన్ ఇన్‌ఫెక్షన్లు కూడా చాలా వరకు పెరుగుతాయి.

తేమ కారణంగా

వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల వైరస్ ,బ్యాక్టీరియాలు పెరుగుతాయి. దీంతో వైరల్ ఫీవర్, బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. ఈ సమయంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు త్వరగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో దోమలు కుట్టడం ద్వారా డెంగ్యూ, మలేరియా టైపాయిడ్ తో పాటు గాలి ద్వారా వ్యాపించే జబ్బులు జలుబు, గొంతునొప్పి వంటివి వస్తాయి. దీనికి తోడు దోమల బెడద కూడా ఎక్కువ అవ్వడంతో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్‌ వంటి వ్యాధులు అవకాశాలు ఎక్కువ. ఈ కాలంలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దలు వరకు అందరూ ఆయా వ్యాధుల బారిని పడుతుంటారు. అలాంటి సమయంలో మన ఇంట్లో ఉండే వాటితోనే చక్కటి ఔషధాలు తయారు చేసుకుని సులభంగా ఆయా వ్యాధుల బారినపడకుండా ఉండొచ్చు అంటున్నారు 

వార్ బర్న్ వ్యాధులు నివారించడానికి మార్గాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • వర్షాకాలంలో బ్యాక్టీరియాలు, వైరస్‌లు మనుషుల మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఎప్పుడు కాచి చల్లార్చిన నీటిని తాగడం మంచిది. గోరువెచ్చని నీరు తాగాలి. 
     
  • ఫిల్టర్, వాటర్ ప్యూరిఫైయర్ నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా నీళ్ల బాటిళ్లు తీసుకెళ్లడం మంచిది. రోడ్డు పక్కన లేదా ఎక్కడపడితే అక్కడ ఉన్న నీటిని తాగకండి.
  • వర్షాకాలంలో ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుంది. అందుకే వీలైనంతవరకు స్ట్రీట్ ఫుడ్ తినడం మానుకోండి. పానీపూరీలు, మసాలా పూరీలు, పావుబాజీ వంటి స్ట్రీట్ ఫుడ్ తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
  • తినడానికి ముందు చేతులు కడుక్కోవాలి.ఏదైనా తినడానికి ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి.ఈ చిన్న అలవాటు మిమ్మల్ని ప్రమాదకర బ్యాక్టీరియా, వైరస్ నుంచి కాపాడుతుంది.
  • పండ్లు, కూరగాయలను ఈ సీజన్‌లో తప్పకుండా కడగాలి. బండి మీద వర్షపునీటి కారణంగా బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇంటికి వచ్చిన వెంటనే మంచి నీటితో శుభ్రంగా కడగడం గుర్తుంచుకోవాలి.
  • దోమలు లేకుండా ఉండేలా చేసుకోండి.  దోమల వల్ల డెంగ్యూ, మలేరియా వంటి వస్తాయి. దోమలు కుట్టకుండా ఉండాలంటే దోమతెరలు వాడటం మంచిది. నిద్రపోయేటప్పుడు ఫుల్ స్లీవ్స్ ధరించండి.
  • బయట వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి శరీరం వెచ్చగా ఉండేలా మంచి దుస్తులు ధరించండి
  • పోషకాహారం ఆహారం తినడం మంచిది. విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తినాలి. ఇవి వ్యాధులు రాకుండా నివారిస్తాయి.  అంతే కాకుండా చుట్టూ ఉండే పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం మంచిది. 
  • ఇల్లు, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ  ఉండకూదు.. ఎక్కడైనా నీరు నిల్వ ఉంటే వాటిని తొలగించండి.
  • పచ్చికాయగూరలు తినొద్దు.. వర్షాకాలంలో ఆకుకూరలు అసలు తినకుండా ఉండటే మంచిది.

ఈ జాగ్రత్తలు అన్ని తీసుకుంటూ మన ఇంట్లో ఉండే మసాల దినుసులతో ఈ కషాయాన్ని తయారు చేసుకుని సేవిస్తే ఆయా వ్యాధుల బారిన పడుకుండా ఉండోచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
 
కషాయం తయారు చేసేందుకు కావలసినవి

  • ధనియాలు: రెండు స్పూన్లు
  • లవంగాలు -4
  • యాలుకలు-2
  • దాల్చిన చెక్క-అంగుళం ముక్క
  • మిరియాలు -8
  • జీలకర్ర- అరస్పూన్‌
  • అల్లం లేదా శోంఠి: అర అంగుళం ముక్క 

తయారీ విధానం: పైన చెప్పిన వాటిని అన్నింటిని దంచుకుని పొడి చేసుకుని ఓ డబ్బాలో స్టోర్‌ చేసుకుండి. కాచిన నీటిలో ఈ పొడిని చిటికెడు వేసుకుని, ఉప్పు వేసుకుని తాగొచ్చు లేదా నిమ్మరసం కలుపుకుని పరగడపున తీసుకుంటుంటే వర్షాకాలంలో వచ్చే ఎలాంటి వ్యాధులు మీ దరిదాపుల్లోకి వచ్చే అవకాశం చాలా తక్కువ అని చెబుతున్నారు ఆయుర్వేద వైద్యులు