సమ్మర్ లో కాటన్, వింటర్ లో స్వెటర్స్.. ఇలా సీజన్ కి తగ్గట్టు రకరకాల ఫ్యాషన్స్ ని ఫాలో అయిపోతుంటారు. కానీ వానాకాలంలో మాత్రం వర్షానికి, తడికి భయపడి ఫ్యాషన్స్ కి దూరంగా ఉంటారు. ఫ్యాషన్ అంటే.. అందం మాత్రమే కాదు. సందర్భాన్ని బట్టి కంఫర్ట్ ఇచ్చేది కూడా. అందుకే వర్షానికి తగ్గట్టు కొన్ని మార్పులు చేసుకుంటే... ఈ మాన్సూన్ ఎట్రాక్టివ్ గా కనిపిస్తూనే కంఫర్ట్ కూడా ఉండొచ్చు. వర్షా కాలంలో ముందు గుర్తు పెట్టుకోవాల్సింది కంఫర్ట్. పొరపాటున ఎప్పుడైనా వర్షంలో తడిచినా ఏ ఇబ్బందీ కలగకుండా చూసుకోవడం ముఖ్యం. అందుకే వానాకాలంలో డ్రెస్సులు, చెప్పులు, యాక్సెసరీస్, జువెలరీ... ఇలా అన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
ఇట్ల వద్దే వద్దు
మాన్సూన్ లో టైట్ ఫిట్లు అస్సలు వేసుకోకూడదు. ఎందుకంటే... ఎపుడైనా వర్షంలో తడిచినపుడు వంటికి అతుక్కుపోయి చాలా చిరాకు తెప్పిస్తాయి. దానికి బదులు వదులుగా ఉండేవి ఎంచుకుంటే మంచిది. అవయితే డ్రెస్ తడిచినా చర్మానికి అంత ఇబ్బంది ఏమీ ఉండదు. ట్రెడిషనల్ గా కనిపించాలనుకునే వాళ్లు సల్వార్, పటియాలా జోలికి వెళ్లొద్దు. వాటి బదులు స్కార్స్, స్టోల్స్ ని జతచేయండి. ట్రాన్స్ పోర్టెంట్ బట్టలు కూడా వద్దే వద్దు. ఒంటికి అతుక్కుపోయే ఫ్యాబ్రిక్ వల్ల వర్షాకాలంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. దాంతో పాటు జీన్స్ ను కూడా పక్కన పెట్టాలి.
ఎందుకంటే వర్షాకాలంలో బట్టలు త్వరగా అరవు. అందుకే చుడీ, పటియాలా, బరువైన జీన్స్ వంటివి ఎంచుకోకపోవడమే మంచిది. ఎక్కువ కుచ్చిళ్లు, భారీ పనితనం, జరీ ఉన్న దుపట్టాల వాడకాన్నీ తగ్గించాలి. మరీ కోల్డ్ షోల్డర్స్, ఆఫ్ షోల్డర్స్, కీహోల్స్ వంటివి లేకుండా చక్కగా బోట్నిక్, రౌండీవెడ్ వంటివాటితో సరిపెట్టుకుంటే మంచిది.
ఇవి ముఖ్యం
వర్షంలో బట్టల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షంలో తడిసినా త్వరగా ఆరిపోయే డ్రెస్ మెటీరియల్ ఎంచుకోవాలి. అందుకే వర్షాకాలంలో నేచురల్ ఫ్యాబ్రిక్స్, డెనిమ్, క్రేప్ సిల్క్ మెటీరియల్ తో తయారైన డ్రెస్లు వాడితే బాగుంటుంది. అలాగే ఈ కాలంలో పొడవుగా కాళ్ల చివర్ల వరకూ ఉండే డ్రెస్ లను వేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే వర్షంలో ఎప్పుడైనా నడవాల్సివస్తే వాటివల్ల ఇబ్బందిగా ఉంటుంది. అందుకే వాటికి బదులు షార్ట్ స్కర్ట్స్, షిఫాన్ చీరలు ఎంచుకోవచ్చు. షార్ట్ ఔట్ ఫిట్స్ నచ్చవనుకుంటే మీడియం లెంత్ ఉన్నా పర్వాలేదు. వాటితో పాటు మాన్సూన్ లో కొత్తగా వీటిని కూడా ట్రై చేయొచ్చు. స్టింగ్ డ్రెస్సెస్, మిడీస్, మ్యాక్సీ డ్రెస్, షర్ట్ డ్రెస్సెస్, రాప్స్, ప్లాన్స్ డ్రెస్సెస్ లాంటివి. ఇవన్నీ షార్ట్, మీడియం లెంగ్త్ ఉండేవే. ఒక్క మ్యాక్సీలు మాత్రం కాస్త పొడవుంటాయి. వాటిలో అరికాళ్లకు పైకి వచ్చేవి. సెలెక్ట్ చేసుకుంటే బెటర్.
యాక్సెసరీస్
ఈ సీజన్ లో హ్యాండ్ బ్యాగులు కూడా మార్చాలి. లెదర్, క్లాత్ తో చేసినవైతే వర్షానికి వెంటనే పొడవుతాయి. ఇక వాచ్ లయితే.. వాటర్ ప్రూఫ్స్ వి దొరుకుతాయి. వాటిని ఎంచుకోండి. గ్యాడ్జెట్స్ వానలో తడవకుండా వాటర్ ప్రూఫ్స్ కవర్లు, అవి కూడా కలర్ఫుల్ గా ఉండేలా చూసుకోండి. జువెలరీ కూడా సింపుల్ గా ఉంటే బెటర్. ప్లాస్టిక్ ఇయర్ రింగ్స్, ఇతర మెటల్ నగలు వాడితే ట్రెండీగా, వర్షాకాలానికి అనువుగా బాగా పనికొస్తాయి. మొబైల్, ల్యాప్ ట్యాప్స్, ట్యాబ్ లాంటి గ్యాడ్జెట్స్ వాననీళ్లలో తడవకుండా ఉండేలా డబుల్ లేయర్డ్ పాలిస్టిక్ స్కిన్ కవర్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. స్కూల్ పిల్లలకు, ఆఫీస్ కి ట్యాబ్ తీసుకెళ్లే వారికోసం స్పెషల్ వాటరూప్ బ్యాగులు కూడా అందుబాటులో ఉన్నాయి. కాలానికి తగ్గట్టుగా స్పెషల్ యాక్సెసరీస్ కూడా మాన్సూన్ స్పెషల్ గా మార్కెట్ లో ఉన్నాయి. వాటిని కూడా కలర్, డిజైన్ చూసి కొనుక్కుంటే ఇంకా స్పెషల్ గా ఉంటుంది.
కాళ్లకు..
అందరూ ఎక్కువగా వాడే లెదర్ షూస్, లెదర్ చెప్పులు వర్షంలో తడిస్తే ఆరడానికి సమయం పడుతుంది. అందుకే ఈ కాలంలో జెల్లీ మాస్, ఫ్లాట్స్ ని ఎంచుకోవాలి. అయితే ఇవి కూడా వర్షంలో జారకుండా వాటి సోలి గ్రిప్ ఉండేలా జాగ్రత్తపడాలి. ఈ కాలంలో చెప్పులు వదులుగా ఉండకుండా చూసుకోవాలి. డ్రెనికి మ్యాచింగ్ అయ్యేలా ఓ నాలుగు జతలు జెల్లీ షూస్ తెచ్చుకుంటే ఈ వానాకాలం వెళ్లిపోతుంది. మీరు స్పెషల్ గా కూడా కనిపించొచ్చు.
కాంబినేషన్స్
సింగిల్ డ్రెస్ కాకుండా కాంబినేషను ను ఇష్టపడే వాళ్లయితే.. మాన్సూస్ లో ఇంకా జాగ్రత తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా అన్ని కాంబినేషన్ లో టాప్స్ డిఫెరెంట్ స్టైల్స్ ఉంటాయి. వాటన్నింటికీ కాంబినేషన్ మాత్రం జీన్సే. కానీ మానస్ జీన్స్ వద్దు.. కాబట్టి దానికి అల్టర్నేటివ్ ఎంచుకోవాలి. మానూన్ లో జీన్స్ కు బదులు అసిమెట్రిక్ కుర్తీస్, ఎ-లైన్ టాప్స్ వేసుకోవడం బెటర్, ఎ-లైన్ టాకు కాంబినేషన్ గా జీసీ కు బదులు ఫ్యాబ్రిక్ లేదా కాటన్ ప్యాంటులు మానూన్ కంఫర్ ఉంటాయి.
జుట్టు, మేకప్
వర్షాకాలంలో అన్నింటికంటే ఎక్కువ ఎఫెక్ట్ పడేది జుట్టు, చర్మం మీదే. వర్షం నుంచి ఎలాగూ తప్పించుకోలేం. అందుకే తర్వాతైనా జాగ్రత్తపడాలి. తడిసిన జుట్టును వీలైనంత త్వరగా ఆరబెట్టుకోవాలి. ఈ సీజన్ లో హెయిర్ స్టైల్ మీద ప్రయోగాలు చేయకపోవడమే ఉత్తమం. సింపుల్ గా ఒక హెయిర్ బ్యాండ్ పెట్టి వదిలేయడమే బాగుంటుంది. అలాగే తడిసిన జుట్టును ఆరబెట్టడానికి చాలామంది డ్రయ్యర్లు వాడతారు. దీనివల్ల జుట్టు బలం కోల్పోవడమే కాక, రాలిపోతుంది కూడా. అందుకే జాగ్రత్త వహించాలి. వర్షాకాలంలో వెంట్రుకలు గాలికి పైకి లేవకుండా కుదురుగా ఉండే దానికి మాన్సూన్ హెయిర్ బ్యాండ్లు కూడా దొరుకుతాయి. వాటిని కూడా వాడొచ్చు.
కలర్స్
మానూన్ లో బ్రైట్ కలర్స్ చాలా బాగుంటాయి. ఎందుకంటే.. వర్షా కాలంలో వాతావరణం చల్లగా ఉండి, బయట లైట్ కూడా సాఫ్ట్ గా ఉంటుంది. అలాంటప్పుడు బ్రైట్ కలర్స్ వాడితే స్పెషల్ గా కనిపిస్తాం. పైగా ముదురు రంగులపై మురికి వదిలించడం తేలిక, బ్రైట్ కలర్స్ అంటే మరీ రంగు రంగులు కాకుండా మోనోక్రమ్ కలర్స్ వాడితే బెటర్. అంటే.. రంగు మారకుండా ఒకే కలర్ లో ఉండే షేడ్స్ వాడాలి. ఎల్లో ఆరెంజ్, రెడ్ మెజంతా, సైబ్లూథిక్ బ్లూ.. ఇవన్నీ మోనోక్రోమ్ కలర్స్, దీంతోపాటు వర్షా కాలం వైట్ కలర్ ను తగ్గిస్తే మంచిది. రెయిన్ లో కాస్త తడిచినా వెంటనే మురికిగా కనిపిస్తుంది. అలాగే ట్రాన్స్పరెంట్ గా కూడా ఉంటుంది.
రంగుల గొడుగులు
వర్షాకాలంలో చాలా మంది వెంట గొడుగులు తీసుకెళ్తుంటారు. మాన్సూన్ లో గొడుగులు మంచి ఫ్రెండ్స్. కానీ గొడుగు అనగానే నల్ల గొడుగు కాకుండా మార్కెట్లో రకరకాల ట్రెండీ గొడుగులు దొరుకుతున్నాయి. వాటిని ట్రై చేయండి. మల్టీ కలర్ గొడుగులు డ్రెస్ మీద కూడా మ్యాచింగ్ అవుతాయి.
రెయిన్ కోట్స్
ఇక రెయిన్ కోట్స్ విషయానికొస్తే ట్రాన్స్పరెంట్ జాకెట్లు మంచి ఆప్షన్. వీటిలో ప్రింటెడ్ కూడా వస్తున్నాయి. ఇవి కూడా మాన్సూన్ లో డిఫరెంట్ లుక్ ఇస్తాయి. ఇక వీటితో పాటు జాకెట్స్, హుడీస్ కూడా చాలా మంది ఇష్టపడతారు. ఇవి అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్స్.. ఎలాంటి డ్రెస్ వేసుకున్నా పైన ఒక వాటర్ ప్రూఫ్ లేదా ఫ్యాబ్రిక్ జాకెట్ వేసుకుంటే వర్షం పల్ల ఇబ్బంది ఉండదు. పైగా లుక్ కూడా కొత్తగా ఉంటుంది.