బెర్హంపూర్: నైరుతి రుతుపవనాలు చురుగ్గా పనిచేస్తున్నాయ్.. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయ్.. అందరికీ హ్యాపీ. కానీ, ఒక ప్రాంతం మాత్రం బోసిపోయి చూస్తోంది. ఎందుకో తెలుసా.. నైరుతికి ముందే వచ్చే వలస పక్షులు రాలేదని. ఒడిశాలోని చిలకా సరస్సుకు వివిధ దేశాల పక్షులు రుతుపవనాలు వచ్చే కన్నా ముందే వస్తుంటాయి. కానీ, ఈ సారి మాత్రం రాలేదు. జాకోబిన్ కుక్కూ (స్థానికంగా పీకా అనిపిలుస్తారు) మాన్సూన్కు ముందే వస్తుందని, కానీ, దాని జాడ ఇప్పటిదాకా లేదని, ఇతర పక్షులదీ అదే పరిస్థితి అని ప్రముఖ ఆర్నిథాలజిస్ట్ (పక్షి సైంటిస్టు) ఉదయ్ నారాయణ్ దేవ్ చెప్పారు. ఆఫ్రికా నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి కరెక్ట్‌గా నైరుతి టైంకు ఆ పక్షి చిలకాలో వాలిపోతుందని, కారణమేంటో తెలియదు గానీ ఆ పక్షి ఇప్పుడు రాలేదని ఆయన చెప్పారు. అది వచ్చిందంటే మాన్సూన్ వచ్చిందన్న నమ్మకం జనాల్లో ఉంటుందన్నారు. అదే కాకుండా ఇంకా కొన్ని రకాల పక్షులూ చిలకాకు రాలేదని, కారణాలేంటో ఇప్పటిదాకా తెలియదని అన్నారు.