హైదరాబాద్ లో మళ్లీ మొదలైన ముసురు వర్షం

హైదరాబాద్ లో మళ్లీ మొదలైన ముసురు వర్షం

హైదరాబాద్ సిటీలో మళ్లీ వర్షం మొదలైంది.. మొన్నటికి మొన్న రెండు రోజులపాటు ఎడతెరిపి లేకుండా వాన పడింది. రెండు రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ ముసురు వర్షం మొదలైంది.. 2024 జూలై 24వ తేదీ మధ్యాహ్నం నుంచి చిరుజల్లులు పడుతున్నాయి. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతం అయ్యింది. జల్లులు పడుతున్నాయి. 

మరోవైపు రంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో ఈరోజు తెల్లవారుజామున చిరు జల్లులతో ముసురు పెడుతోంది. బుధవారం ఉత్తర, మధ్య తెలంగాణలో మోస్తరు - భారీ వర్షాలు, దక్షిణ దక్షిణ తెలంగాణలో మధ్యాహ్నం - తేలికపాటి - మోస్తరు వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలో ఈ రోజు సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెపుతోంది.